- Telugu News Photo Gallery Cricket photos Are You Planning To Buy Smart Phone Price Under 10000 Have Look On These Smartphones
Smart Phones: రూ. పది వేల లోపు స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా.? అయితే బెస్ట్ ఫోన్‌లపై ఓ లుక్కేయండి..
Smart Phones Under 10K: అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్‌లపై భారీగా ఆఫర్లు ప్రకటించారు. ఇందులో భాగంగా బడ్జెట్‌లో రూ. 10వేల లోపు అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్‌లపై ఓ లుక్కేయండి. ఈ ఆఫర్ నేటితో ముగియనుంది.
Updated on: Aug 09, 2021 | 12:06 PM

బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్‌ను ప్లాన్ చేస్తున్నారా.? అయితే అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2021లో భాగంగా రూ. పది వేల లోపు అందుబాటులో కొన్ని ఫోన్‌లు ఉన్నాయి. ఆ ఫోన్‌లు ఏంటి? వాటి ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆఫర్లు సోమవారం అర్థరాత్రితో ముగియనున్నాయి.

Redmi 9A: రెడ్‌మీ 9ఏ ఫోన్‌ను అమేజాన్ రూ. 7,799కే అందుబాటులోకి తీసుకొచ్చింది. 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

Realme C11: 2జీబీ ర్యామ్ 32 స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఈ ఫోన్ రూ. 7,625కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

Samsung Galaxy M02: శాంసంగ్ గ్యాలక్సీ ఎమ్02 స్మార్ట్‌ఫోన్ రూ. 7,999కి ఆఫర్‌లో భాగంగా అందిస్తోంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో ఉన్న ఈ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

Redmi 9 Prime: 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధర రూ. 9,999గా ఉంది. ఈ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

Tecno Spark 7: చైనాకు చెందిన టెక్నో స్పార్క్ 7 స్మార్ట్ ఫోన్ రూ. 8,499కి అందుబాటులోంది. ఈ ఫోన్‌లో 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కెపాసిటీని అందించారు. ఇందులో 16 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.




