AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponguleti Srinivasa Reddy: హస్తం గూటికే.. భట్టి విక్రమార్కతో భేటీ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

Ponguleti Srinivasa Reddy - Bhatti Vikramarka: తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ తీరును ఖండించి బయటకు వచ్చిన.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

Ponguleti Srinivasa Reddy: హస్తం గూటికే.. భట్టి విక్రమార్కతో భేటీ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి..
Ponguleti Srinivasa Reddy - Bhatti Vikramarka
Shaik Madar Saheb
|

Updated on: Jun 22, 2023 | 12:35 PM

Share

Ponguleti Srinivasa Reddy – Bhatti Vikramarka: తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ తీరును ఖండించి బయటకు వచ్చిన.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అవ్వడం రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి వద్ద పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శిబిరం వద్ద భేటీ.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. వడదెబ్బ కారణంగా రెండు రోజులుగా అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కను.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భట్టి త్వరగా కోలుకోవాలని పొంగులేటి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణలపై ఇద్దరి మధ్య 40నిమిషాలకు పైగా ఏకాంతంగా చర్చలు జరిగాయి. ఖమ్మంలో జరగబోయే పాదయాత్ర ముగింపు సభ, పార్టీలో చేరికల అంశంపై ఈ సందర్భంగా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు భట్టి పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రజలు కలలు కన్న తెలంగాణ.. కాంగ్రెస్ తోనే సాధ్యం అని పేర్కొన్నారు. అమరుల కుటుంబానికి ఇచ్చిన హామీని ఏ ఒక్కటిని అమలు చేయలేదంటూ పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలు కేసీఆర్ ను రాబోయే ఎన్నికల్లో క్షమించరన్నారు. తాను సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్ లోకి రావట్లేదని పొంగులేటి ఈ సందర్భంగా స్పష్టంచేశారు.

కేసీఆర్ ను గద్దె దించదానికి ఎన్ని మెట్లు దిగడానికైన సిద్ధమేనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు కలిసి రావాలని ఆయన కోరారు. మోసపూరితమైన మాటలకు చరమగీతం పాడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంతో ప్రజల ఆకాంక్షలు నెరవేరేలేదని, సీఎం కేసీఆర్ రెండు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, పెట్టిన అంశాలను నెరవేర్చలేదని విమర్శించారు. ఇందుకు నిదర్శనమే అమరవీరుల దినోత్సవమని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పొంగులేటిని కాంగ్రెస్ లోకి మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం దోపిడికి‌ గురవుతోందని అన్నారు. ఏ లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకిన్బామో అవన్నీ నీరూగారుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలోకి వేయాలని పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్నారని భయపడుతున్నారని చెప్పారు. పొంగులేటి చేరిక సభ ఎప్పుడు ఉంటుందో త్వరలో చెప్తామని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..