Actress : 150పైగా సినిమాలు.. సౌత్ ఇండస్ట్రీని అల్లాడించిన గ్లామర్ క్వీన్.. 27 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా..
ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో అందం, అభినయంతో అలరించిన తారలు చాలా మంది ఉన్నారు. అద్భుతమైన నటనతోపాటు.. చూడచక్కని రూపంతోనూ అడియన్స్ గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.

ప్రస్తుతం ఓ సీనియర్ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకప్పుడు ఆమె దక్షిణాదిలో టాప్ హీరోయిన్. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతోపాటు తనదైన నటనతో కట్టిపడేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా అన్ని భాషలలో తనదైన ముద్ర వేసింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ మూవీస్ చేసింది. కానీ దాదాపు 27 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇంతకీ ఆ కలువ కళ్ల చిన్నది ఎవరో గుర్తుపట్టారా. ? పైన కనిపిస్తున్న హీరోయిన పేరు మాధవి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
1976లో తెలుగులో తూర్పు పడమర అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. అప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత మూడేళ్లకు తమిళంలోకి అరంగేట్రం చేసింది. తెలుగుతోపాటు మిగత భాషలలోనూ ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అప్పట్లో చీరకట్టులోనే కాకుండా గ్లామర్ బ్యూటీగానూ ఇండస్ట్రీని రూల్ చేసింది. హిందీలో గ్లామర్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగింది. మాధవి.. ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి. ఆమె వెయ్యికి పైగా స్టేజ్ షోలు ప్రదర్శించింది.
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..
కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆమె 1996లో వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఈ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. గత 27 ఏళ్లుగా మాధవి ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం ఆమె తన భర్త, పిల్లలతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటుంది. అలాగే అక్కడ ఆమె పైలట్ లైసెన్స్ పొందింది. విమానం నడపడం తెలిసిన ఏకైక భారతీయ నటి మాధవి కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
