TSPSC Group 4 Hall Tickets: జులై 1వ తేదీన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 రాత పరీక్ష.. ఈ వారాంతంలో హాల్‌టికెట్లు

TSPSC Group 4 Hall Ticket 2023: తెలంగాణ గ్రూప్‌-4 రాతపరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను టీఎస్‌పీఎస్సీ ఈ వారంలో విడుదలకానున్నాయి. ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌..

TSPSC Group 4 Hall Tickets: జులై 1వ తేదీన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 రాత పరీక్ష.. ఈ వారాంతంలో హాల్‌టికెట్లు
TSPSC Group 4
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 22, 2023 | 1:12 PM

TSPSC Group 4 Hall Ticket 2023: తెలంగాణ గ్రూప్‌-4 రాతపరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను టీఎస్‌పీఎస్సీ ఈ వారంలో విడుదలకానున్నాయి. ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జులై 1న రాతపరీక్ష నిర్వహించనున్నారు. దాదాపు 8,180 గ్రూప్‌-4 సర్వీసు పోస్టులకు ఈ నియామక పరీక్ష జరగనుంది. దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపోస్టుకు 116 మంది పోటీపడనున్నారు. వీరందరికీ ఒకే రోజున పరీక్ష నిర్వహించేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.

కాగా టీఎస్‌పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో ఎంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. 2018లో 700 వీఆర్‌వో ఉద్యోగాలకు దాదాపు 10.58 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 7.9 లక్షల మంది పరీక్ష రాశారు. ఈ వారం చివరిలో హాల్‌టికెట్లు జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. పేపర్‌-1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.