TSPSC Group 1 Answer Key: వచ్చే వారంలో.. టీఎస్పీయస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆన్సర్ ‘కీ’ విడుదల
తెలంగాణ టీఎస్పీయస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 11 (ఆదివారం) నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 503 గ్రూప్-1 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ రాతపరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ 'కీ' వచ్చేవారంలో..
హైదరాబాద్: తెలంగాణ టీఎస్పీయస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 11 (ఆదివారం) నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 503 గ్రూప్-1 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ రాతపరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ వచ్చేవారంలో విడుదల కానుంది. ప్రాథమిక ఆన్సర్ ‘కీ’తో పాటు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ల కాపీలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో ముగియనుంది. అలాగే పరీక్షకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నపత్రంని కూడా వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.
ఇమేజింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రిలిమనరీ పరీక్ష మాస్టర్ ప్రశ్నపత్రం, గ్రూప్-1 ప్రిలిమినరీ కీ టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది ఆన్సర్ కీ విడుదల చేస్తారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రయత్నాలు చేస్తోంది. తుది ఆన్సర్ కీ విడుదలైన తర్వాత నెలరోజుల్లోగా ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తోంది. తదుపరి మెయిన్స్ పరీక్షలకు మూడు నెలల వ్యవధి ఇచ్చేలా కార్యచరణ రూపొందిస్తున్నారు.
ఇక ఈ నెల 11న నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,33,248 మంది హాజరయ్యారు. గత ఏడాది అక్టోబరు 16న నిర్వహించిన పరీక్షతో పోలిస్తే ఈసారి దాదాపు 55 లక్షల మంది పరీక్షకు హాజరుకాలేదు. పేపర్‌లీకుల నేపథ్యంలో గతేడాది జరిగిన గ్రూప్ 1 పరీక్షను రద్దుచేసి ఈ నెల 11న నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.