TS ICET 2023 Results: తెలంగాణ ఐసెట్ ఫలితాలు వాయిదా.. ఎప్పుడనేది త్వరలో ప్రకటన
తెలంగాణ ఐసెట్ 2023 ఫలితాలు వాయిదాపడ్డాయి. అధికారిక ప్రకటన ప్రకారం మే 20న ఐసెట్ ఫలితాలు ప్రకటించవల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఫలితాలు వెల్లడించడం లేదని ఐసెట్ పరీక్ష కన్వీనర్ ప్రొఫెసర్ పి వరలక్ష్మి ఓ ప్రకటనలో..
TS ICET 2023 Result Date: తెలంగాణ ఐసెట్ 2023 ఫలితాలు వాయిదాపడ్డాయి. అధికారిక ప్రకటన ప్రకారం మే 20న ఐసెట్ ఫలితాలు ప్రకటించవల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఫలితాలు వెల్లడించడం లేదని ఐసెట్ పరీక్ష కన్వీనర్ ప్రొఫెసర్ పి వరలక్ష్మి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో తెలంగాణ ఐసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 20 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. దాదాపు 70,900 మంది విద్యార్ధులు ఐసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.
షెడ్యూల్ ప్రకారం వీటి రిజల్ట్స్ జూన్ 20న విడుదల చేయాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు కన్వినర్ తెలిపరాఉ. ఫలితాల తేదీని త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆమె వివరించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.