AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫోన్‌ ఎత్తాలంటేనే జంకుతోన్న నాయకులు.. అసలేం జరుగుతోందంటే.

నాయకులరా మీకు పాలనా నాయకుడి పై కోపం ఉందా ఆయనకు మీకు పంచాయితీ ఉందా వెంటనే ఫోన్ చేసి లెఫ్ట్ రైట్ ఇవ్వాలి అన్నంత కసితో రగిలిపోతున్నారా రగిలితే రగిలరు కానీ ఫోన్ తీసి నంబర్ డైల్ చేసేరు సుమీ బుక్కయిపోతారు ఫోన్ పెట్టేసిన మరు క్షణమే మీ ఫోన్ టాక్ వైరల్ అవ్వడం పక్కా మరి ఇంతకీ ఎవరు ఆ నాయకులు ఏంటి ఆ ఫోన్ కాల్స్ అసలు గొడవేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Telangana: ఫోన్‌ ఎత్తాలంటేనే జంకుతోన్న నాయకులు.. అసలేం జరుగుతోందంటే.
Telangana
Follow us
Sridhar Prasad

| Edited By: Narender Vaitla

Updated on: Jul 13, 2023 | 2:57 PM

నాయకులరా మీకు పాలనా నాయకుడి పై కోపం ఉందా ఆయనకు మీకు పంచాయితీ ఉందా వెంటనే ఫోన్ చేసి లెఫ్ట్ రైట్ ఇవ్వాలి అన్నంత కసితో రగిలిపోతున్నారా రగిలితే రగిలరు కానీ ఫోన్ తీసి నంబర్ డైల్ చేసేరు సుమీ బుక్కయిపోతారు ఫోన్ పెట్టేసిన మరు క్షణమే మీ ఫోన్ టాక్ వైరల్ అవ్వడం పక్కా మరి ఇంతకీ ఎవరు ఆ నాయకులు ఏంటి ఆ ఫోన్ కాల్స్ అసలు గొడవేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. ఫోన్ కాల్స్ వివాదాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీకి నాయకుడు ధమ్కీ ఇవ్వడం కాదు సొంత పార్టీ నాయకులే ఫోన్ కాల్స్ లో గొడవలు బెదిరింపులకు దిగడం ఆ కాల్స్ రికార్డ్ అవ్వడం అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఫోన్ లో మాట్లాడుకోవాలి ఆయా విషయాలపై నిలదీసుకోవాలి అంటేనే జంకుతున్నారు నాయకులు.

కాంగ్రెస్ పార్టీలో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో అగ్గి రాజేస్తోంది సొంత పార్టీకి చెందిన చెరుకు సుధాకర్ కుమారుడికి కాల్ చేసి నిన్ను ని తండ్రిని చంపేస్తారు అంటూ వర్ణింగ్ ఇవ్వడం ఆ కాల్ రికార్డ్ బయటకు రావడంతో కోమటిరెడ్డి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆవేశంలో మాట్లాడాను తప్ప వేరే ఏం లేదు అంటూ కోమటి రెడ్డి కవర్ చేసే ప్రయత్నం చేసినా జరగాల్సిన నష్టం జరిగింది అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక అటు బిఆర్ఎస్ పార్టీలోనూ ఇదే సీన్‌.. నాగర్ కర్నూల్ ఎంపీ రాములుకు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు మధ్య ఫోన్ కాల్ పంచాయితీ ప్రగతి భవన్ వరకు చేరింది. గువ్వల బాలరాజు ఇలాకాలో ఎంపీ రాములు కుమారుడు ఫ్లెక్సీ లు కట్టడం పట్ల ఆగ్రహానికి గురైన గువ్వల ఏకంగా ఎంపీ రాములుకు కాల్ చేసి వార్నింగ్‌ ఇవ్వడంతో జిల్లాలో రచ్చ మొదలైంది.

పెద్దమనిషి ఎంపీకి కాల్ చేసి ఇలా మాట్లాడటం ఏంటా అని పార్టీలో చర్చ మొదలైంది. అటు ఎంపీ రాములు ఈ ఫోన్ కాల్‌ని సీరియస్‌గా తీసుకోని బీఆర్‌ఎస్‌ పెద్దలకు ఫిర్యాదు చేశారని సమాచారం. మరో వైపు భూకబ్జాల విషయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ బీజేపీ నేతల ఫిర్యాదుతో సొంత పార్టీ నాయకులకు ఫోన్ కాల్‌లో ఇచ్చిన మాస్ వార్నింగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ కాల్ తనకు డ్యామేజ్ కాకున్నా కూడా రికార్డ్ అయ్యి వైరల్ అవ్వడం ఇబ్బందిగా మారింది. అప్పట్లో మంత్రి మల్లారెడ్డి ఒక రియల్ ఎస్టేట్ విషయంలో అవతలి వ్యక్తితో మాట్లాడిన కాల్ పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ తన నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ ఛానెల్ ప్రతినిధితో మాట్లాడిన మాటలు ఎంత రాజకీయ చిచ్చు పెట్టాయో తెలిసిందే. సో ఇలా నేతలు ఆవేశం లో చేస్తున్న ఫోన్ కాల్స్ తిరిగి వారికే ఇబ్బందిగా మారడంతో మిగతా నాయకులు ఫోన్ కాల్స్ అంటే జంకుతున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..