Hyderabad: ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
చాలా మంది ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువులే ఇప్పుడు వాళ్ల ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నాయి. అవును పిల్లలు కారణంగా తెలంగాణలో ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. తాను ఇష్టంగా పెంచుకున్న పిల్లి మరణించదనే మనస్తాపంతో ఇటీవలే ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే నగరంలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దన్నందుకు ఓ యువతి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది.

పిల్లల కారణంగా గడిచిన వారం రోజుల్లో ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. పిల్లి చనిపోయిందని మూడు రోజుల క్రితం మీర్ పేటకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా, పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దన్నందుకు అల్వాల్‌లో నివాసం ఉంటున్న MBBS విద్యార్థిని శ్రేష్ట ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయింది. వివరాళ్లోకి వెళ్తే.. అల్వాల్ చెందిన కుసుమలత, దేవదత్తం దంపతుల కుమార్కె శ్రేష్ట ప్రస్తుతం MBBS చదువుతోంది.
పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దన్నందుకు ఆత్మహత్య
ఆయితే ఇంట్లో పెంచుకుంటున్న ఒక పెంపుడు పిల్లి విషయంలో శుక్రవారం తల్లితో శ్రేష్ణ వాగ్వాదం జరిగింది. అప్పుడు పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని తల్లి శ్రేష్టను మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రేష్ట ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికొచ్చిన పేరెంట్స్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన కూతురిని చేసి కన్నీరుమున్నీరుగా విలపించారు. PG పరీక్షలకు సిద్ధమవుతూ మంచి ఫ్యూచర్‌కి ప్లాన్ చేసుకుంటున్న అమ్మాయి సడన్‌గా ఇలా చిన్న గొడవకి ప్రాణాలు తీసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
పిల్లి చనిపోయిందని ఆత్మహత్య
ఇదిలా ఉండగా గత మూడు రోజుల క్రితం ఇలాంటి ఘటనే మీర్‌పేటలో వెలుగు చూసింది.తాను ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి మరణం తట్టుకోలేక పురుగుల మందుతాగి హిమబిందు యువతి ఆత్మహత్య చేసుకుంది. మీర్‌పేట్‌లో పేరెంట్స్‌తో పాటు నివసిస్తున్న హిమబిందు గత రెండేళ్లుగా ఒక పిల్లిని పెంచుకుంటుంది. దాన్ని ఇంట్లో వాళ్ల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేది. అయితే ఆ పిల్లి ఇటీవల మరణించింది. అంత ప్రేమగా పెంచుకున్న పిల్లి చనిపోవడంతో ఏదో కోల్పోయినట్టు ఫీలైన హిమబిందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యలు నిర్దారించారు.
సాధారణంగా కుక్కలు, పిల్లులు, పక్షులను చాలా మంది ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. కొందరైతే వాటిని ఇంట్లో సభ్యుల్లా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తమసొంత పిల్లల వలే వాటికి కూడా బర్త్‌డేలు చేస్తూ ఉంటారు.అంత ఇష్టంగా పెంచుకున్న నేస్తాలు దూరమైతే బాధ పడడం సహజమే. అయితే ఆ ఇష్టమే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలు పోయేందుకు కారణం అవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
