Telangana: వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. అమ్మవారికి జలాభిషేకం..

అన్నదాత ఆశగా ఎదురుచూసిన రుతుపవనాలు అడుగు పెట్టాయని సంతోషం నిలవలేదు.  వర్షాలు కురవకపోవడంతో .. పలు జిల్లాలో రైతులు, మహిళలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల నిర్వహించిన పూజలు ఆకట్టుకుంటున్నాయి.

Telangana: వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. అమ్మవారికి జలాభిషేకం..
People Pray For Rain
Follow us

|

Updated on: Jun 24, 2024 | 6:49 AM

అన్నదాత ఆశగా ఎదురుచూసిన రుతుపవనాలు అడుగు పెట్టాయని సంతోషం నిలవలేదు.  వర్షాలు కురవకపోవడంతో .. పలు జిల్లాలో రైతులు, మహిళలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల నిర్వహించిన పూజలు ఆకట్టుకుంటున్నాయి.  ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే వచ్చాయన్న సంతోషం తప్పా.. వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. తెలంగాణలో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురిసినా కొన్ని వరంగల్‌.. సిద్ధిపేట జిల్లాలో వర్షాలు కురవలేదు.

వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వర్షాలు కురవాలని వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హనుమకొండలోని పద్మాక్షి కాలనీలో పోచమ్మతల్లి, కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు చేశారు మహిళలు. విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు జలకళ సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని మహిళలు నీళ్ల బిందెలు ఎత్తుకొని ఆలయాలకు చేరుకుని విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు. పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు.

ఇవి కూడా చదవండి

పౌర్ణమి రోజున పోచమ్మకు ప్రత్యేక పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. గతంలోనూ ఇలాంటి పూజ చేయడం వల్ల తమ మొక్కులు ఫలించయంటున్నారు మహిళలు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోతున్నామని.. ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలోను వర్షాల కోసం కప్పల పెళ్లి నిర్వహించారు.

రెండు కప్పలకు పసుపు నీళ్లతో స్నానం చేయించి, మంత్రోచ్ఛారణల మధ్య ఆ రెండు కప్పులకు అందరూ చూస్తుండగా వివాహం జరిపించారు. ఈ ఆచారంలో భాగంగా మహిళా రైతులు కప్పలకు నీళ్లు పోస్తుంటే పిల్లలు కర్రకు కట్టిన కొత్తగా పెళ్లయిన కప్పల జంటను తీసుకొని గ్రామమంతా తిరిగారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..