Telangana: పోలీసులను చూసి కారు మరో రూట్‌లోకి మలిపారు.. ఛేజ్ చేసి ఆపి చెక్ చేయగా

అస్సలు తగ్గడం లేదు. మొన్న ఎన్నికల వేళ సైలెంట్ అయినవాళ్లు.. ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్నారు. పోలీసులు పట్టుకుని జైళ్లలో వేస్తున్నా.. మళ్లీ బెయిల్‌పై బయటకు వచ్చి అదే దందాకు పూనుకుంటున్నారు.

Telangana: పోలీసులను చూసి కారు మరో రూట్‌లోకి మలిపారు..  ఛేజ్ చేసి ఆపి చెక్ చేయగా
Representative Checkpost
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 23, 2024 | 9:22 PM

ఎన్నికల వేళ తనిఖీ నేపథ్యంలో వెనక్కి తగ్గిన పెడ్లర్లు.. ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ గంజాయి రవాణా చేసేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు. తాజాగా కారులో తరలిస్తున్న 228 కిలోల గంజాయిని ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌, ఎక్సైజ్‌‌‌‌ పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం భద్రాచలం వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన కారులో నుంచి ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి చర్ల వైపు కారు మళ్లించి పారిపోడానికి యత్నించారు. పోలీసులు వారిని ఛేజ్ చేసి.. లక్ష్మీనగరంలో అరెస్ట్‌‌‌‌ చేశారు. కారులో చెక్ చేయగా రూ. 65 లక్షల విలువైన 228 కిలోల గంజాయి దొరికింది. వారి నుంచి గంజాయితో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌‌‌‌కు చెందిన కరెన్సీని స్వాధీనం చేసుకొని, ముగ్గురు అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు పంపారు.

మణుగూరులో…

అటు మణుగూరు పోలీసులు సైతం అక్రమంగా తరలిస్తున్న 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌‌‌‌కు గంజాయిని తరలిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడంతో… పోలీసులు శుక్రవారం మణుగూరులోని సీఎస్పీ కాంటా వద్ద చెక్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బైక్‌‌‌‌పై వస్తున్న ఒడిశాలోని మల్కనగిరి జిల్లా చిత్రకొండకు చెందిన గురుకిల, పోదు వంత్నల్‌‌‌‌ను ఆపి చెక్ చేయగా గంజాయి దొరికింది. వారి వద్ద నుంచి రూ. 3.5 లక్షల విలువైన 14 కిలోల గంజాయితో పాటు బైక్‌‌‌‌ను సీజ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..