దొంగ అడిగిన ప్రశ్నకు కంగుతిన్న ఇంటి యాజమాని.. చివరకు జరిగిందిదే..
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ముగ్గురు యువకులు దొంగతనానికి పాల్పడ్డారు. శివాలయం రోడ్లో పట్టపగలు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించారు. సరిగ్గా అదే సమయానికి ఇంట్లోని వారు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు దొంగలు. ఇంట్లో చోరీకి పాల్పడుతున్న దొంగలను యజమాని భూపాల్ రెడ్డి పట్టుకున్నారు. చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగల్లో ఒకరిని పట్టుకొని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ముగ్గురు యువకులు దొంగతనానికి పాల్పడ్డారు. శివాలయం రోడ్లో పట్టపగలు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించారు. సరిగ్గా అదే సమయానికి ఇంట్లోని వారు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు దొంగలు. ఇంట్లో చోరీకి పాల్పడుతున్న దొంగలను యజమాని భూపాల్ రెడ్డి పట్టుకున్నారు. చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగల్లో ఒకరిని పట్టుకొని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇక్కడ నివ్వెరపోయే విషయం ఏమిటంటే.. దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో ఇంట్లోకి వచ్చిన యజమనులనే మీరు ఎవరు.. ఎందుకు వచ్చారని ప్రశ్నలు అడిగారు దొంగలు. దీంతో ఖంగుతిన్న యజమానులు పోలీసులకు ఫోన్ చేశారు.
ఈలోపూ ముగ్గురు దొంగలు పారిపోయే ప్రయత్నం చేశారు. అందులో ఒకరిని పట్టుకుని గ్రామస్థులు దేహశుద్ది చేశారు. అంతలో వచ్చిన పోలీసులకు దొంగను అప్పగించారు. అయితే పారిపోయిన ఇద్దరు దొంగలు ఇంట్లోని రూ. 60వేల నగదు, మూడు తులాల బంగారు ఉండరాలు, చెవిదుద్దులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. భూపాల్ రెడ్డి దంపతులు పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గా దర్శనానికి వెళ్లిన సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. ఇక పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా దొంగల్లో ఒకరు మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందగా మిగిలిన వారు పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గతంలో కూడా నేరేడుచెర్లలో దొంగతనం జరిగిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా దొంగతనాలకు పాల్పడింది ఈ ముఠానే అని తేల్చారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..