AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెస్టినేషన్ వెడ్డింగ్స్‎కు అడ్డాగా మారిన నగరం.. ఈ ప్రదేశాలకు క్యూ కట్టిన నవ వధూవరులు..

పెళ్లి.. చిరకాలం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఎంతో ఘనంగా పెళ్లిళ్లు చేయడం సౌత్ ఇండియన్ ప్రత్యేకత అయితే.. కొన్ని ఏళ్లుగా ప్రీ వెడ్డింగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ కొనసాగుతోంది. మొదట్లో సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మాత్రమే వివిధ ప్రదేశాలకు వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్స్‎ను చేసుకునేవారు. ఆ తర్వాత ఈ కల్చర్ కాస్త దేశవ్యాప్తంగా విస్తరించింది.

డెస్టినేషన్ వెడ్డింగ్స్‎కు అడ్డాగా మారిన నగరం.. ఈ ప్రదేశాలకు క్యూ కట్టిన నవ వధూవరులు..
Pre Wedding Shoot
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jun 23, 2024 | 5:09 PM

Share

పెళ్లి.. చిరకాలం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఎంతో ఘనంగా పెళ్లిళ్లు చేయడం సౌత్ ఇండియన్ ప్రత్యేకత అయితే.. కొన్ని ఏళ్లుగా ప్రీ వెడ్డింగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ కొనసాగుతోంది. మొదట్లో సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మాత్రమే వివిధ ప్రదేశాలకు వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్స్‎ను చేసుకునేవారు. ఆ తర్వాత ఈ కల్చర్ కాస్త దేశవ్యాప్తంగా విస్తరించింది. తమకు తగినట్టుగా తక్కువ ఖర్చుతో, భరించగలిగే ఆర్థిక స్తోమతతో దగ్గరలో ఉన్న కొన్ని డెస్టినేషన్ ప్రాంతాలను ఎన్నుకొని ఆ ప్రదేశాలలో ఫ్రీ వెడ్డింగ్ షూట్స్‎ను చేసుకుంటున్నారు నూతన నవ వధూవరులు.

ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అనగానే ఉదయ్‎పూర్, జోధ్‎పూర్, గోవా లాంటి ప్రదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్స్‎కు కేరాఫ్ అడ్రస్‎గా ఉన్నాయి. గత కొంత కాలంగా ఈ ప్రాంతాలు వీటికి కేంద్రాలుగా మారాయి. ఈ నేపథ్యంలో డెస్టినేషన్ వెడ్డింగ్ షూట్ పెరిగిపోవడంతో వాటికి నవ వధూవరులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాష్ట్రంలోనే కొన్ని జిల్లాలలో వెడ్డింగ్ కోసం కొన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రణాళికలు చేస్తోంది రాష్ట్ర పర్యాటకశాఖ. దీంతో ఈ వేడుకలు జరపడానికి అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్స్ కూడా ఆసక్తి చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం నగరంలో జరిగిన అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్స్ సమ్మేళనంలో ఆ దిశగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

తారామతిలో ఫోటోషూట్స్.. రాణి మహల్‎లో పెళ్లిళ్లు, అనంతగిరి హిల్స్‎లో ప్రీ వెడ్డింగ్ షూస్. ఇలా ఈ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగానే కనిపిస్తుంది. మరొకవైపు లక్కవరం సోమశిలలు సైతం పర్యాటక ప్రాంతాలుగా ఉండడంతో అక్కడ కూడా ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేసేందుకు ఆసక్తి చెబుతున్నారు. హైదరాబాద్ చారిత్రాత్మక కట్టడమైన తారామతి, బారామతి మహల్స్ వెడ్డింగ్ డెస్టినేషన్లకు అడ్డాగా మారాయి. తారామతిలో ఐదు గంటల ఫోటోషూట్‎కు ఉదయం అయితే రూ. 8,000 సాయంత్రమైతే రూ. 10,000 చార్జ్ చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లు, రిసెప్షన్ లాంటివైతే ఓపెన్ ఏరియా‎కు రూ. 70,000 వరకు ఉంటుంది. ఇలా తమతమ సౌకర్యాలను బట్టి ప్లాన్ చేస్తున్నారు నేటి యువ వధూవరులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..