Watch Video: నగరంలో రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. సినిమా ఆర్టిస్టులపై దాడికి యత్నం..
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీధికుక్కల దాడులతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మణికొండలోని చిత్రపురి కాలనీలో సినిమా ఆర్టిస్టులు ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా ఇదే చిత్రపురి కాలనీలో ఒక మహిళపై దాదాపు 15 వీధి కుక్కలు గుంపుగా దాడికి యత్నించాయి. ఆమె సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టంట్ మాన్ బద్రి భార్యగా తెలుస్తోంది. వీధికుక్కల దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీధికుక్కల దాడులతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మణికొండలోని చిత్రపురి కాలనీలో సినిమా ఆర్టిస్టులు ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా ఇదే చిత్రపురి కాలనీలో ఒక మహిళపై దాదాపు 15 వీధి కుక్కలు గుంపుగా దాడికి యత్నించాయి. ఆమె సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టంట్ మాన్ బద్రి భార్యగా తెలుస్తోంది. వీధికుక్కల దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొద్దిరోజుల క్రితం ఒక చిన్న బాలుడిని వెళ్లిన వీధి కుక్కలు నోట కరచుకొని వెళ్లినట్లు చెబుతున్నారు స్థానికులు.
ఆ ఘటనను చూసిన కొందరు కుక్కల నుంచి బాలుడిని విడిపించారు. చిత్రపురి కాలనీలో ఇప్పటివరకు 30 మందికి పైగా ఆ కుక్కల దాడిలో గాయపడినట్లు తెలుస్తోంది. వీధికుక్కల భారీ నుంచి రక్షణ కల్పించాలంటూ టీవీ9 ద్వారా జిహెచ్ఎంసి అధికారులకు స్థానికులు విన్నవించుకుంటున్నారు. ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే సినిమా ఆర్టిస్టులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వారి పిల్లలు, స్కూల్ విద్యార్థులు భయపడుతున్నట్లు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
