ఆదర్శానికే స్పూర్తిదాయకం ఈ ఘటన.. భర్త కోసం భార్య ఎలాంటి పని చేసిందంటే..
యోగా అనేది ఒక క్రియ. శరీరాన్ని మనసుతో ముడిపెట్టి ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసల మీద ఏకాగ్రతతో చేసే ఆసనాలు మనిషిని ఒక గొప్ప శక్తిగా మారుస్తాయి. అలాంటి అద్భుతం ఒక యోగాలో ఉంటుంది. కరోనా కంటే భయంకరమైన వ్యాధి బారిన పడి కండరాలలో సత్తువలేకుండా కాళ్ళు, చేతులు, నడుము పని చెయ్యకుండా మంచానికే పరిమితం అయిన భర్తను తీసుకొని తిరగని ఆసుపత్రులు లేవు. వాడని మందులు లేవు.

యోగా అనేది ఒక క్రియ. శరీరాన్ని మనసుతో ముడిపెట్టి ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసల మీద ఏకాగ్రతతో చేసే ఆసనాలు మనిషిని ఒక గొప్ప శక్తిగా మారుస్తాయి. అలాంటి అద్భుతం ఒక యోగాలో ఉంటుంది. కరోనా కంటే భయంకరమైన వ్యాధి బారిన పడి కండరాలలో సత్తువలేకుండా కాళ్ళు, చేతులు, నడుము పని చెయ్యకుండా మంచానికే పరిమితం అయిన భర్తను తీసుకొని తిరగని ఆసుపత్రులు లేవు. వాడని మందులు లేవు. అప్పుడే పుట్టిన పసి బిడ్డను ఎలా కన్న తల్లి సాకుతుందో.. అలా తన భర్తను ఒక పసి బిడ్డలా భావించింది. తను యోగా నేర్చుకుని తాను ఆసనాలు వేస్తూ భర్తకు యోగా చేపిస్తూ నాలుగేళ్లలో భర్తను తిరిగి నడిచేలా చేసింది ఆ మహాపత్ని. తాను నేర్చుకున్న యోగాతో ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని అధిగమించి.. నలుగురికీ ఆదర్శంగా నిలిచింది ఆ మహిళ. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామానికి చెందిన పాలా అరుణా అనే మహిళ గత 10 ఏళ్ల నుంచి యోగా టీచర్‌గా సేవ చేస్తుంది. తన భర్త పాలా మోహన్ రెడ్డికి గులియం బ్యారోమ్ సిండ్రోమ్ అనే వ్యాధి సోకడంతో శరీరంలోని ప్రతి నాడి వ్యవస్థ పనిచేయకుండా సత్తువ లేకుండా సచ్చు పడిపోయాయి.
ఎలాంటి చలనం లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న తన భర్తను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చింది. ఎందరో ఫిజియోథెరపీలతో వైద్యం చేయించింది. కొంత శరీరంలో మార్పు రావడాన్ని గమనించిన భార్య యోగా నిపుణుల సలహాల మేరకు తానే ఒక యోగా గురువుగా తర్ఫీదు పొందింది. తన భర్త ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆయనలోని నాడి వ్యవస్థను మెరుగు పడేలా నాలుగేళ్లు కఠోర ఆసనాలు వేయించింది. ఒక తల్లిలా.. గురువులా.. ఒక భార్యగా.. తాను ఎంతో సేవ చేసింది. ఆ ఫలితం కారణంగా తన భర్త నడవలేని స్థితిలో నుంచి యోగా ఆసనాలు వెయ్యగలిగే స్థాయికి ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యోగాతో భర్త ఆరోగ్యాన్ని తానే స్వయంగా కాపాడుకోవడంతో అదే విద్యను పది మందికి ఉచితంగా అందించాలని సంకల్పించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యోగా టీచర్‌గా పని చేస్తూ విద్యార్దులకు ఆసనాలు వేయడం, ప్రాణాయామం చెయ్యడం నేర్పుతున్నారు. తనతో పాటు ఆరోగ్యంగా కోలుకున్న తన భర్త కూడా వచ్చి యోగా ఆసనాలు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా భర్త ఆరోగ్యం కోసం తానే ఒక ట్రైనర్‌గా మారి కుటుంబానికి వచ్చిన సవాళ్లను జయించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
