Watch Video: మనసున్న మంత్రి.. క్యాన్సర్ సోకిన చిన్నారికి అభయం ఇచ్చిన కోమటిరెడ్డి
నల్గొండ శ్రీనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ పార్క్ ప్రాంగణం.. వందల మంది గుమికూడి ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అందరినీ ఓదార్చుతున్న ఆనేత అక్కడున్న వారిలో కొత్త ఆశలు నింపుతున్నారు. కష్టం తీరిందన్న భావోద్వేగంతో వెనుతిరుగుతున్న సామన్యులు. కానీ అక్కడ ఓ సంఘటన ఆ నేతతో పాటు అందరి హృదయాలను బరువెక్కించింది.

నల్గొండ శ్రీనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ పార్క్ ప్రాంగణం.. వందల మంది గుమికూడి ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అందరినీ ఓదార్చుతున్న ఆనేత అక్కడున్న వారిలో కొత్త ఆశలు నింపుతున్నారు. కష్టం తీరిందన్న భావోద్వేగంతో వెనుతిరుగుతున్న సామన్యులు. కానీ అక్కడ ఓ సంఘటన ఆ నేతతో పాటు అందరి హృదయాలను బరువెక్కించింది.
నల్గొండ పట్టణానికి చెందిన హరీష్, సరితల దంపతులకు పదేళ్ళ కూతురు లిషిత ఉంది. వీరిది చిన్న కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. కాలం.. కన్నెర్ర చేసింది. చిన్నారి లిషితను క్యాన్సర్ మహమ్మారి కమ్మెసింది. ఒకటో స్టేజీ దాటి రెండో స్టేజీకి చేరుకుంది. చిన్నారికి ఇప్పటికే రెండు కీమోథెరపీలు అయిపోయాయి. ప్రతి రోజు పనికి వెళితేగానీ పూటగడవని పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి వారికి కీమోథెరిపీ అనేది కొండను మోసేంత కష్టమే. కానీ.. కన్నపేగు బంధంతో చిన్నగా ప్రయత్నిద్దామని చాలా మందిని కలిశారు. ఎవ్వరిని అడిగిన ఆ పూట సాయమే చేశారు. కానీ తన కష్టం తీరాలంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవాలని కొందరు సూచించారు.
బిక్కు బిక్కుమంటూ లిషిత తల్లిదండ్రులు నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా దర్బార్‌కు చేరుకున్నారు. తమ కూతురి ఆరోగ్య పరిస్థితిని మంత్రి కోమటిరెడ్డికి చెబుతూ గోడున వెళ్ళబోసుకున్నారు. క్యాన్సర్‌తో స్కూల్‌కు కూడా వెళ్లడం లేదని మంత్రికి చెప్పారు. క్యాన్సర్ రెండో స్టేజీలో ఉన్న పదేళ్ల చిన్నారి లిషితాను ఒళ్లో కూర్చోబెట్టుకొని మంత్రి కోమటిరెడ్డి ఓదార్చారు. ఆత్మవిశ్వాసం నింపే యువరాజ్ సింగ్ ఉదాంతాన్ని పూసగుచ్చినట్టు చెబుతూ.. గో హెడ్ రోజు స్కూల్‌కి వెళ్లు ఫ్రెండ్స్‌తో ఆటలు ఆడు.. పాటలు పాడు అంటూ చిన్నారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.
ఒళ్లో కూర్చున్న చిన్నారి కొండంత ధైర్యంతో ఆయన చేతుల్లో చెయ్యేసి నాకిక భయం లేదన్నట్టు ధైర్యంగా స్కూల్‌కు వెళ్తానని మంత్రికి ప్రామిస్ చేసింది. అంతా శుభమే జరుగుతుందని అమాయకులైన తల్లిదండ్రుల గుండెల్లో ధైర్యం నింపారు. మంత్రి వెంటనే ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ రోహిత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. అప్పటికప్పుడే రూ.50వేలు సహాయం అందించారు. రేపు సాయంత్రం మరో రెండు లక్షల సహాయం అందిస్తానని మాటిచ్చాడు. ఈ సంఘటన అక్కడున్న అందరి హృదయాలను బరువెక్కించింది. థ్యాంక్యూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు అంటూ మంత్రికి ఆ తల్లిదండ్రులతో పాటు ఆ చిన్నారి కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
