AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కుక్కల దాడి నుంచి తప్పించుకుని.. కాపాడండంటూ ఎమ్మెల్యే ఆఫీసుకు వచ్చిన చుక్కల దుప్పి..

తమ తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుంటారు. అలాంటిది మూగజీవాలు కూడా తమ గోడును విలపించేందుకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకు ఇది ఎక్కడో కాదు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జనరణ్యాంలోకి వచ్చిన చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేశాయి.

Watch Video: కుక్కల దాడి నుంచి తప్పించుకుని.. కాపాడండంటూ ఎమ్మెల్యే ఆఫీసుకు వచ్చిన చుక్కల దుప్పి..
Forest Officers
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 23, 2024 | 8:17 PM

Share

తమ తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుంటారు. అలాంటిది మూగజీవాలు కూడా తమ గోడును విలపించేందుకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకు ఇది ఎక్కడో కాదు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జనరణ్యాంలోకి వచ్చిన చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్ర రక్తస్రావంతో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దయానంద్ క్యాంపు కార్యాలయంలోకి వచ్చింది. గాయాలపాలైన చుక్కల దుప్పిని చూసి వెంటనే అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సతీమణి మట్టా రాగమయి ఫోన్‎ చేశారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని వైద్య సేవలు అందించారు.

సహజంగా ప్రజల సమస్యలను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తుంటారు. అలాంటిది సత్తుపల్లి నడిబొడ్డున ఉన్న అర్బన్ పార్క్‎లో నుంచి బయటకు వచ్చిన చుక్కల దుప్పి కుక్కల దాడిలో గాయపడి తనను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చినట్టుందని స్థానికులు సరదాగా అనుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా అర్బన్ పార్క్ నుంచి బయటకు వచ్చిన దుప్పులు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృత్యు వాత పడిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. వృత్తి రీత్యా డాక్టర్ కుటుంబానికి చెందిన మట్టా రాగమయి, దయానంద్‎లు తెలియని వారుండరు. వారికి మూగ జీవాలంటే మక్కువ ఎక్కువే. కోవిడ్ కాలంలో కోతులకు తరుచుగా ఆహారం కూడా పెట్టేవారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..