Medchal: బైక్‌పై వచ్చి .. కత్తితో పొడిచి.. దొంగల బీభత్సం.. సిసి టీవీ ఫుటేజ్ వీడియో.
మేడ్చల్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే జ్యూయలరీ షాప్ యజమాని పై కత్తితో దాడి చేశారు. ఓ ఇద్దరు దొంగలు జగదాంబ బంగారం షాపులోకి చొరబడి.. గోల్డ్, క్యాష్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యజమానిపై కత్తితో దాడి చేశారు. ఇద్దరిలో ఒక దొంగ.. మహిళలా బుర్ఖా ధరించగా, మరొక దొంగ హెల్మెట్ పెట్టుకున్నాడు. అయితే బంగారం దుకాణం యజమాని ధైర్యం చేసి దొంగల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి వచ్చాడు.
మేడ్చల్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే జ్యూయలరీ షాప్ యజమాని పై కత్తితో దాడి చేశారు. ఓ ఇద్దరు దొంగలు జగదాంబ బంగారం షాపులోకి చొరబడి.. గోల్డ్, క్యాష్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యజమానిపై కత్తితో దాడి చేశారు. ఇద్దరిలో ఒక దొంగ.. మహిళలా బుర్ఖా ధరించగా, మరొక దొంగ హెల్మెట్ పెట్టుకున్నాడు. అయితే బంగారం దుకాణం యజమాని ధైర్యం చేసి దొంగల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి వచ్చాడు. గట్టిగా అరవడంతో.. దొంగలిద్దరూ బయటకు పరుగెత్తుకు వచ్చి అతనిపై మరోసారి దాడి చేసేందుకు యత్నించారు. దుకాణం లోపల ఉన్న ఓ యువకుడు కుర్చీ తీసుకొని పరుగెత్తుకొచ్చి.. బైక్‌పై పారిపోయేందుకు యత్నించిన దొంగలపై విసిరాడు.
దాడి ఘటన దృశ్యాలు షాప్ సి.సి కెమెరా లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. గాయాలపాలైన బాధితుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే దొంగలు బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధిత యజమాని తెలిపాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలొ దోపిడీ దొంగల వీరవిహారం చేయడం గమనార్హం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

