AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైలు టికెట్ కొని అందులో ప్రయాణించని గ్రామస్తులు.. అసలు విషయం ఇదే..

నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఉన్న ఏకైక రైల్వేస్టేషన్‌ నెక్కొండ. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఇదొక్కటే దగ్గర్లో ఉన్న స్టేషన్. టికెట్ లేకుండా రైలెక్కేవాళ్లను చూస్తుంటాం. రోజు అదే పనిగా టికెట్లు కొని రైలు ఎక్కనివాళ్లను చూసారా. ఒక‌రో ఇద్దరో కాదు మొత్తం ఉరు ఊరు అదే పనిలో ఉంది. వ‌రంగ‌ల్‌ జిల్లా నెక్కొండ ప్రజలు రోజు 100 టిక్కెట్లు కొంటున్నారు.

Telangana: రైలు టికెట్ కొని అందులో ప్రయాణించని గ్రామస్తులు.. అసలు విషయం ఇదే..
Nekkonda Railway Station
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Feb 18, 2024 | 7:10 AM

Share

నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఉన్న ఏకైక రైల్వేస్టేషన్‌ నెక్కొండ. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఇదొక్కటే దగ్గర్లో ఉన్న స్టేషన్. టికెట్ లేకుండా రైలెక్కేవాళ్లను చూస్తుంటాం. రోజు అదే పనిగా టికెట్లు కొని రైలు ఎక్కనివాళ్లను చూసారా. ఒక‌రో ఇద్దరో కాదు మొత్తం ఉరు ఊరు అదే పనిలో ఉంది. వ‌రంగ‌ల్‌ జిల్లా నెక్కొండ ప్రజలు రోజు 100 టిక్కెట్లు కొంటున్నారు. కానీ ఒక్కరు కూడా కనీసం రైల్వే స్టేషన్‎కు కూడా రారు. దీనికి కార‌ణం మాత్రం చాలా డిఫరెంట్‎గా ఉంది. అది అక్కడి ప్రజల పోరాటం అని చెప్పొచ్చు..

నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఉన్న ఏకైక రైల్వేస్టేషన్‌ నెక్కొండ. నియోజక వర్గ ప్రజ‌లు రైలు ప్రయాణం చేయాలంటే ఈ రైల్వేస్టేష‌నే దగ్గర్లో ఉంది. అయితే ఇక్కడ చాలా ట్రైన్లకు హాల్ట్ లేదు. దీంతో దూర ప్రయాణాలు చేయాల్సిన‌వారు ఇక్కడ ఆగే రైళ్లలో వ‌రంగ‌ల్‌, కాజీపేట‌, సికింద్రాబాద్ వంటి స్టేష‌న్లకు వెళ్లి అక్కడి నుంచి వేరే రైలెక్కాల్సి వ‌స్తోంది. స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకొస్తే.. చివరకు అక్కడ తాత్కాలికంగా హాల్ట్ ఇచ్చారు. అక్కడే కండిషన్స్ అప్లై అన్నారు రైల్వే అధికారులు. మూడు నెలలు ఈ స్టేషన్ నుంచి ఆదాయం వస్తేనే పర్మినెంట్ హాల్ట్‎గా గుర్తిస్తామన్నారు. తాత్కాలికంగా ఇచ్చిన హాల్టింగ్‌ను ఎలాగైనా ప‌ర్మినెంట్ చేసుకోవాల‌ని గ్రామస్థులు సంక‌ల్పించారు.

ఇందుకోసం కొంతమంది యువత వినూత్న ఆలోచన చేశారు. నెక్కొండ రైల్వే ఫోరం పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ తయారుచేశారు. గ్రూప్ ద్వారా చందాలు వసూలు చేస్తూ టిక్కెట్లు కొంటున్నారు. దీంతో స్టేషన్‌కు ఆదాయం చూపించ‌గ‌లుగుతున్నారు స్థానికులు. ఇప్పటికే ఈ వాట్సప్ గ్రూప్‎లో 500 మంది ఉన్నారు. వచ్చే చందాలతో టిక్కెట్లు కొంటు.. సభ్యుల ఆధార్ కార్డులతో రిజర్వేషన్లు కూడా చేయిస్తున్నారు. దీనికి అక్కడున్న స్థానిక వ్యాపారస్తులు కూడా సహకరిస్తున్నారు. ఇప్పటికీ నెల రోజులు పూర్తయింది. ఇంకో రెండు నెలలు ఇలాగే స్టేషన్‎కు ఆదాయం చూపించాలని అక్కడి స్థానికులు తాపత్రయం. కానీ ఈ వినూత్న ప్రయత్నం ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. పర్మినెంట్ హాల్ట్ ఇచ్చిన తర్వాత ఆదాయం ఒక్కసారిగా పడిపోతే రైల్వే శాఖ మళ్లీ పర్మినెంట్ నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..