Munugode Bypoll: మరికొన్ని గంటల్లో తేలిపోనున్న మునుగోడు ఫలితం.. గులాబీ బాస్ అంచనాలు నిజమవుతాయా..?

రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరొకొన్ని గంటల్లో తేలబోతోంది. రిజల్ట్ ఎలా ఎండబోతుందనే ఉత్కంఠ అభ్యర్థులతో పాటు ఓటర్లలోనూ నెలకొంది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేసినట్టే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్‌కు బూస్టప్‌ ఇవ్వబోతోందా?

Munugode Bypoll: మరికొన్ని గంటల్లో తేలిపోనున్న మునుగోడు ఫలితం.. గులాబీ బాస్ అంచనాలు నిజమవుతాయా..?
CM KCR
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 05, 2022 | 5:36 PM

రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరొకొన్ని గంటల్లో తేలబోతోంది. రిజల్ట్ ఎలా ఎండబోతుందనే ఉత్కంఠ అభ్యర్థులతో పాటు ఓటర్లలోనూ నెలకొంది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేసినట్టే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్‌కు బూస్టప్‌ ఇవ్వబోతోందా? ఇక విపక్షాల దూకుడుకు గులాబీ పార్టీ కళ్లెం వేయనుందా? ఈ ఫలితం తర్వాత అధికార పార్టీ భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇవే అంశాలపై చర్చలు జోరందుకున్నాయి. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్‌ఎస్‌కు కీలకంగా మారింది. ఆ రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో టీఆర్ఎస్ నుంచి కొందరు నేతలు బీజేపీకి వెళ్లడం, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అంటూ బీజేపీ ప్రచారం చేసుకోవడం గులాబీ టీమ్‌కు ఇబ్బందిగా మారింది. ఎలాగైనా మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి బీజేపీకి చెక్‌ పెట్టాలనే పట్టుదలతో గులాబీ బాస్‌ పావులు కదిపారు.

బీఆర్‌ఎస్‌పై నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఎన్నిక కావడంతో ఎట్టి పరిస్థితిలో గెలవాలనే కసితో చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా వర్క్‌ చేసింది టీఆర్‌ఎస్‌. అభ్యర్థి ఎంపికతో దగ్గరి నుంచి మొదలుకొని ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌ వరకు ఎక్కడా స్లిప్‌ కాకుండా చూసుకుంది. చివరగా ఫామ్‌హౌస్‌ ఎపిసోడ్‌ బూస్ట్‌గా మారిందనే చెప్పాలి. ఇక ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ అనుకూలంగా రావడంతో మునుగోడు ఫలితం పై ధీమాగా ఉంది టీఆర్‌ఎస్‌. ఈ ఫలితం పొలిటికల్‌ టానిక్‌ ఇవ్వడమే కాకుండా పార్టీ భవిష్యత్తుకు, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడుతుంది అనే భావనలో పార్టీ పెద్దలు ఉన్నారంటున్నారు.

ఉప ఎన్నిక రిజల్ట్‌తో అటు బీజేపీ దూకుడుకు బ్రేకులు పడడమే కాకుండా టిఆర్‌ఎస్‌ను వీడే ఆలోచనలో ఉన్న నేతలు ఆగిపోవడం….ఇప్పటికే పార్టీని వీడి బీజేపీ లో చేరిన నేతలు కూడా తిరిగివచ్చే అవకాశాలు లేకపోలేదు అని పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బూత్‌ల వారీగా పోలింగ్‌ సరళిపై టీఆర్‌ఎస్‌ పోస్ట్‌మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అంచనాకు వచ్చింది. పోలింగ్‌ శాతం పెరిగిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ ఆధిక్యత సాధిస్తారని పార్టీ అంచనా వేసింది. ఈ మేరకు మండలాలు, యూనిట్ల వారీగా పార్టీ ప్రచార ఇన్‌చార్జీలుగా పనిచేసిన నేతలు తమ నివేదికలు సమర్పించారు.

ఇవి కూడా చదవండి

పోలింగ్‌ బూత్‌ల వారీగా నమోదైన ఓట్లు, వాటిలో టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీలకు వచ్చే ఓట్లపై తమ అంచనాలను గణాంకాలతో సహా పొందుపరిచారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ ఈ నివేదికలను క్రోడీకరించి పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. పోలైన ఓట్లలో 50శాతం మేర ఓట్లను టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సాధిస్తాడని ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ ఇన్‌చార్జీల నుంచి అందిన నివేదికలతోపాటు ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేటు సంస్థల నివేదికలు, వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను కూడా సీఎం విశ్లేషించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మొత్తానికి మునుగోడు ఫలితం ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పినట్టే టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వస్తే మాత్రం పార్టీలో, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న అనేక చర్చలకు ఎండ్‌కార్డ్‌ పడుతుందంటున్నాయి గులాబీ వర్గాలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. 

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.