Telangna Forest Lands: అటు ఎమ్మెల్యే.. ఇటు అటవీ అధికారులు.. ముదురుతున్న వివాదం..

ఖమ్మంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, అటవీ అధికారుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ప్రభుత్వ భూములను అటవీ అధికారులు కబ్జా చేస్తున్నారంటూ..

Telangna Forest Lands: అటు ఎమ్మెల్యే.. ఇటు అటవీ అధికారులు.. ముదురుతున్న వివాదం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 18, 2020 | 12:46 PM

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, అటవీ అధికారుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ప్రభుత్వ భూములను అటవీ అధికారులు కబ్జా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేయగా.. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు తేవడం చేతకాక తమపై జులుం ప్రదర్శిస్తున్నారంటూ అటవీశాఖ అధికారులు భగ్గుమంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రభుత్వ భూములు కొందరు అటవీ అధికారుల స్వాధీనంలో ఉన్నాయంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన ఆరోపణలు చేశారు. జాయింట్ సర్వే చేస్తే నిజానిజాలు తేలుతాయన్నారు. అంతటితో ఆగని ఎమ్మెల్యే.. ‘మా భూములు గుంజుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? అటవీశాఖ అధికారులు నిజాయితీపరులైతే సీబీఐ విచారణకు సిద్ధమా? మీ కబ్జాలో భూములు ఉన్నాయని తేలితే ఎలాంటి శిక్షనైనా అంగీకరిస్తారా?’ అంటూ రేగా కాంతారావు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. ఈ పోస్ట్‌లు పెను దుమారాన్ని రేపాయి.

ఈ వ్యాఖ్యలపై జిల్లా అటవీ అధికార యంత్రాంగం భగ్గమంది. అంతేస్థాయిలో ఎమ్మెల్యే తీరుపై అధికారులు విమర్శలు గుప్పించారు. అధికార పక్షంలో ఉండి కూడా ప్రభుత్వం నుండి ఆర్‌ఓఎఫ్ఆర్ పట్టాలు తీసుకురావడం చేతకాక అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంతారావు విధానం ఏమాత్రం సరికాదన్నారు. ఈ క్రమంలో కాంతారావు వ్యాఖ్యలకు నిరసనగా వారు ధర్నా చేపట్టారు.

Also read:

టీడీపీ నేత రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు, పలు కీలక డాక్యుమెంట్ల స్వాధీనం..తెరపైకి కొత్త పేరు !

Bigg Boss 4 Telugu: మనసులను తాకిన కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు..తన మాటలతో కన్నీరు పెట్టించిన సొహైల్