Traffic Challan In Telangana: ఇదెక్కడి నిబంధన.. కామారెడ్డిలో విచిత్ర జరిమానా.. ఇలా కూడా ఫైన్ వేస్తారా!?
నిజామాబాద్ జిల్లాలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎప్పుడూ.. ఎక్కడా.. ఇది జరిగి ఉండదు. చేయని తప్పుకు..
నిజామాబాద్ జిల్లాలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎప్పుడూ.. ఎక్కడా.. ఇది జరిగి ఉండదు. చేయని తప్పుకు ఓ ప్రభుత్వ ఉద్యోగి విచిత్రంగా ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నెలక్రితం కామారెడ్డి జిల్లా బీర్కూర్ పీఎస్ పరిధిలోని ఓ గ్రామానికి వెళ్లారు. దానికి సంబంధించి ఇటీవల ఆయన ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా సందేశం అని ఓపెన్ చేసి చూడగా.. సదరు ఉద్యోగి ఒక్కసారిగా కంగు తిన్నాడు. హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంతో ఆయనకు రూ.135 ఫైన్ కట్టాలంటూ ఆ మేసెజ్ సారాంశం. ఇందులో షాక్ ఏముందని తొందర పడకండి. ఆయన వెళ్లింది కారులో అయితే.. హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేయడం ఏంటి? ఇదే అంశంపై ప్రశ్నించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్‌ను ఉద్యోగి కాంటాక్ట్ అయ్యారు. స్పందించిన పోలీసులు ఏం జరిగిందా అని ఆరా తీశారు. ఫోన్ నెంబర్ తప్పుగా ఎంట్రీ చేయడం వల్ల ఇది జరిగిందని తేల్చారు. ఇదే విషయాన్ని పోలీసులు సదరు ప్రభుత్వ ఉద్యోగికి చెప్పారు. అయితే ఫైన్ మాత్రం కట్టాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆ ఉద్యోగి ఫైన్ చెల్లించాడు.
Also read:
గుజరాత్ లో మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ఇప్పటికే 9 మంది మృతి.. జాగ్రత్త ఉండాలంటున్న వైద్యులు
రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల చర్చ