రవితేజ సినిమాలో రంగమ్మత్త.. ఖిలాడీ సినిమాలో కీలక పాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అనసూయ..!

రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా అందరి ప్రశంసలు అందుకుంది యాంకర్‌ అనుసూయ. ప్రతివారం జబర్దస్త్‌లో కుర్రకారులను మత్తెక్కించే అనసూయ.. సినిమాల ఎంపికలో మాత్రం అచితూచిగా...

రవితేజ సినిమాలో రంగమ్మత్త.. ఖిలాడీ సినిమాలో కీలక పాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అనసూయ..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 18, 2020 | 12:13 PM

రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా అందరి ప్రశంసలు అందుకుంది యాంకర్‌ అనుసూయ. ప్రతివారం జబర్దస్త్‌లో కుర్రకారులను మత్తెక్కించే అనసూయ.. సినిమాల ఎంపికలో మాత్రం అచితూచిగా వ్యవహరిస్తోంది. రంగస్థలం సినిమా తర్వాత ఈ అమ్మడు అభిమానుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంటుంది. ఇటీవల కాలంలో అనసూయ పలు సినిమాల్లో నటించి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘రంగమార్తాండ’ సినిమాలో మరో మంచి పాత్రలో నటిస్తుంది అనసూయ. ఇటీవల హీరో రవితేజ సినిమాకు మాత్రం వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది.

అంతేకాదు వెంటనే షూటింగ్‌ లోకేషన్‌కు వెళ్లిపోయినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మాస్‌ మహారాజ రవితేజ రాక్షసుడు ఫేమ్‌ రమేష్‌ వర్మ కాంబోలో తెరకెక్కతున్న ఖిలాడీ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషించడానికి వెంటనే అంగీకరించిందట. అయితే రవితేజ ఖిలాడీ సినిమాలో అనసూయ ఒప్పుకొన్నా ఆ కీలక పాత్ర మామూలు పాత్ర కాదట.

ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం అనుసూయను తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే అనసూయ ఆ పాత్రకు వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందట. దీని బట్టి చూస్తే రవితేజ సినిమాలో పక్కాగా నెగిటివ్ షేడ్స్‌ ఉన్న కీలక పాత్ర చేస్తుందని ప్రేక్షకులు ఓ అవగాహనకు వచ్చినా రావచ్చు.