Bigg Boss Telugu 4 : చివరివారం కిక్ తగ్గింది, ఓటింగ్‌పై కూడా ఎఫెక్ట్..కంటెస్టెంట్లకు ఆ అవకాశం లేనట్లేనా..?

బిగ్ బాస్ సీజన్ 4 ఎండింగ్‌కు వచ్చింది. 15 వారాలుగా రోజుకో మలుపు తిరిగిన ఈ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో..చివరి వారం మాత్రం అంచనాలను అందుకోలేకపోతుంది.

Bigg Boss Telugu 4 : చివరివారం కిక్ తగ్గింది, ఓటింగ్‌పై కూడా ఎఫెక్ట్..కంటెస్టెంట్లకు ఆ అవకాశం లేనట్లేనా..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 18, 2020 | 11:19 AM

బిగ్ బాస్ సీజన్ 4 ఎండింగ్‌కు వచ్చింది. 15 వారాలుగా రోజుకో మలుపు తిరిగిన ఈ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో..చివరి వారం మాత్రం అంచనాలను అందుకోలేకపోతుంది. ఇన్ని రోజులుగా ఆసక్తికర టాస్కులు, అంతకు మించి ట్విస్టులతో అలరించిన బిగ్ బాస్ షో..చివరి మాత్రం చప్పగా ప్లాన్ చేశారు. చివరి వారం..మొదటి రోజు నుంచే టాస్క్‌లకు గుడ్‌ బై చెప్పేసిన బిగ్ బాస్ నిర్వాహకులు.. ఎమోషనల్ అంశాలపై ఫోకస్ పెట్టారు.  తొలి రోజు… టైటిల్ విజేతగా ఎవరు పనికిరారు అని చెప్పించే ఒక్క టాస్క్‌ తప్ప ఈ వీక్‌లో బిగ్‌ బాస్‌లో సాలిడ్‌గా ‌ఎంటర్‌టైన్ చేసిందే లేదు. ఇదే ఇప్పుడు బిగ్ బాస్ ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది.

వీకెండ్‌కు దగ్గర పడుతున్న టైంలో అయినా స్పీడు పెంచుతున్నారా అంటే అదీ లేదు.. బుధవారం నుంచి హౌస్‌మెట్స్ జర్నీ వీడియోలను ప్లే చేస్తున్నారు. ఒక్కో హౌస్‌మేట్‌తో పర్సనల్‌గా మాట్లాడుతున్న బిగ్‌ బాస్‌.. షోను సాదాసీదాగా లాగించేస్తున్నారు. కనీసం హౌస్‌మెట్స్‌కు ఫైనల్‌గా ప్రూవ్‌ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకపోవటంతో.. ఓటింగ్ కూడా స్లో అవుతుందేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

Also Read : 

ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు