Bigg Boss 4 Telugu: మనసులను తాకిన కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు..తన మాటలతో కన్నీరు పెట్టించిన సొహైల్
గురువారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగింది. సొహైల్, హారిక, అరియానాల జర్నీని చూపించారు బిగ్ బాస్. వారితో ముచ్చటించాడు.

గురువారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగింది. సొహైల్, హారిక, అరియానాల జర్నీని చూపించారు బిగ్ బాస్. వారితో ముచ్చటించాడు. ముఖ్యంగా తన జర్నీ చూసిన అనంతరం సొహైల్ మాట్లాడిన తీరు భావోద్వేగానికి గురిచేసింది.
తొలుత హారిక గురించి బిగ్ బాస్ మాట్లాడారు. “మిమ్మల్ని ఎన్ని మేఘాలు కప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. సూర్యకాంతిలా వాటిని ఛేదించుకుంటూ ముందుకు వచ్చారు. చిన్న ప్యాకెట్.. పెద్ద ధమాకా అనే కామెంట్ నిజం చేస్తూ ఫైనల్స్ వరకూ సత్తా చాటారు” అని బిగ్ బాస్ పేర్కొన్నారు. అనంతరం ఆమె ప్రయాణాన్ని చూపించారు. ఆ వీడియోలో హారిక టాస్కులు ఆడిన విధానం..డ్యాన్స్‌తో అదరొట్టిన సమయాలు..గోడవలు, సరదాలు, భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి. వీడియో చూసిన అనంతరం మాటలు రావడం లేదు బిగ్ బాస్ అని ఎమోషనల్ అయ్యింది హారిక. ఈ 14 వారాలు ఎలా గడిచాయో అర్థం కావట్లేదని, ప్రతిరోజు కొత్త విషయానని నేర్చుకున్నానని చెప్పింది. రేపటి రోజున తాను ఉన్నా, లేకపోయినా… అలేఖ్య హారిక లైఫ్ హిస్టరీ తీస్తే బిగ్ బాస్ అనేది మిగిలిపోతుంది చెప్పుకొచ్చింది.
ఇక సొహైల్ జర్నీ నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. ‘ సోహైల్ ఇతరులను ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఈ ఇంట్లో అడుగు పెట్టారెు.. కానీ మీ ప్రయాణం ముగిసే సమయానికి ప్రతి ఇంట్లో వ్యక్తిగా అభిమానాన్ని పొందారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరికీ సొహైల్‌లో ఉన్న అన్ని భావోద్వేగాలను ప్రజలు చూశారు. స్నేహితుల కోసం ఎంతదూరమైనా వెళ్లారు. మీ ప్రతి ఎమోషన్ చాలా స్వచ్ఛంగా అనిపించింది. మీ ఎనర్జీకి, ఆట ఆడాలనే తాపత్రయనాకి సెల్యూట్. మీరు పడ్డ శ్రమకి, ప్రతిభకు మీ కథ వేరే ఉంటుంది’ అని బిగ్ బాస్ పేర్కొన్నాడు. అనంతరం అతడి బిగ్ బాస్ ఇంట్లో జర్నీ వీడియోను చూపించారు. తన వీడియో చూసిన అనంతరం సోహైల్ ఏడ్చేశాడు. బిగ్ బాస్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పాడు. పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా తనకు గుర్తింపు దక్కలేదని.. థియేటర్‌కి వెళ్లినప్పుడు తన సినిమాకు తానే టికెట్లు కొనుక్కునేవాడినని చెప్పాడు. ఈ రోజు తనను ఇప్పుడు కొన్ని కోట్ల మంది చూస్తున్నారని.. రేపు ప్రేక్షకులు తన సినిమా చూసి హిట్ ఇస్తారనే నమ్మకం వచ్చిందని చెప్పాడు.
ఇక తాను బోల్డ్ అంటూ బిగ్ బాస్‌లో హౌస్‌లో అడుగుపెట్టిన అరియానా ఎమోషనల్ జర్నీ కూడా మనసులను తాకింది. ‘అరియానా మీరు బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక సంచలనం. ఏ రోజు మీరు వేగాన్ని తగ్గించలేదు. ఆటను ఆటగా ఆడుతున్నారు. మీ ఎనర్జీతో ప్రత్యేకంగా నిలిచారు. ఇతరుల వల్ల ప్రభావితం అవ్వలేదు. ఒంటరి అయినా.. రాజీ పడకుండా లక్ష్యం దిశగా దూసుకెళ్లారు. రోజు రోజుకీ మీలో ఉన్న నిజమైన ఆట కనబరిచారు. అందుకే ఈరోజు ఇక్కడ షైనింగ్ స్టార్ అరియానాగా నిలిచారు. మీ కష్టానికి తగిన ఫలితం లభించాలని కోరుకుంటున్నా’ అని బిగ్ బాస్ పేర్కొన్నాడు. తన వీడియో చూసిన అనంతరం ఎమోషనల్ అయ్యింది అరియానా. లైఫ్‌లో మర్చిపోలేని స్థానం ఇచ్చారు.. సమాజంలో తనకు బిగ్ బాస్ అరియానా అనే గుర్తింపు ఇచ్చారని పేర్కింది. ఎప్పటికీ బిగ్ బాస్‌ని మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యింది.




