టీడీపీ నేత రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు, పలు కీలక డాక్యుమెంట్ల స్వాధీనం..తెరపైకి కొత్త పేరు !

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ ట్రాయ్ కేసు దర్యాప్తుకు సంబంధించి ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి.

టీడీపీ నేత రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు, పలు కీలక డాక్యుమెంట్ల స్వాధీనం..తెరపైకి కొత్త పేరు !
Follow us

|

Updated on: Dec 18, 2020 | 12:39 PM

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ ట్రాయ్ కేసు దర్యాప్తుకు సంబంధించి ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. అధికారులు పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుని ఎగవేశారన్న ఆరోపణలపై రాయపాటి కంపెనీలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది.  సీబీఐ అధికారులు ఈ కేసు విషయంలో గతలంలో పలుసార్లు సోదాలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించారు. తాజా తనిఖీలకు సంబంధించి సీబీఐ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే తమ  కంపెనీ సీఈవోగా పనిచేసిన శ్రీధర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రాయపాటి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అతడిపై సీబీఐకి రాయపాటి కుటుంబం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీధర్ ఫేక్ పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సీబీఐకి సమాచారం ఇచ్చారట.  ఈ నేపథ్యంలో రాయపాటి నివాసం, కార్యాలయంతో పాటుగా శ్రీధర్ ఇళ్లల్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

Also Read : 

ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు