AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ ఆందోళనకు రాత్రిలోగా ఎండ్‌కార్డ్‌? మంత్రికి స్వాగతం పలికిన విద్యార్థులు..

మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 8 వేల మంది విద్యార్థులతో వాళ్ల క్యాంపస్‌లోనే ములాఖత్ అయ్యారు. మంత్రి వెంట.. ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌ కూడా ఉన్నారు. మీ డిమాండ్లేంటి… మా పరిష్కారాలేంటి..

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ ఆందోళనకు రాత్రిలోగా ఎండ్‌కార్డ్‌? మంత్రికి స్వాగతం పలికిన విద్యార్థులు..
Sabita Indra Reddy
Sanjay Kasula
|

Updated on: Jun 20, 2022 | 10:00 PM

Share

ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడ్డానికి బాసర వచ్చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 8 వేల మంది విద్యార్థులతో వాళ్ల క్యాంపస్‌లోనే ములాఖత్ అయ్యారు. మంత్రి వెంట.. ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌ కూడా ఉన్నారు. మీ డిమాండ్లేంటి… మా పరిష్కారాలేంటి అంటూ స్టూడెంట్స్‌తో చర్చలు మొదలుపెట్టారు మంత్రి సబిత. ఏడురోజులుగా సాగుతున్న ఆందోళనకు ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రధాన డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని డిసైడైంది టీ-సర్కారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి, ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జ్ వీసీ రాహుల్ బొజ్జా, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రెండుసార్లు రివ్యూ చేశారు. డిమాండ్ల పరిష్కారంలో సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఒక ముసాయిదాతో బాసర వెళ్లి విద్యార్థులను కలిశారు మంత్రి సబిత. 8 వేల మంది విద్యార్థుల ఎదుటే వాళ్ల సమస్యలపై చర్చిస్తారు. జోరు వానలో సైతం సీఎం తమ క్యాంపస్‌కి రావడంపై హర్షం వ్యక్తం చేశారు స్టూడెంట్స్. తెల్లారేలోగా కీలక ప్రకటన చేసి, ఆందోళన విరమించే ఛాన్సుంది.

అంతకుముందు… తమవి గొంతెమ్మ కోరికలు కానేకావంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్. 2018 నుంచి రెగ్యులర్ వీసీ నియామకం కోసం అడుగుతున్నామని, సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసి… అపాయింట్‌మెంట్స్ జరపాలని కోరారు. అందుక్కావల్సిన బడ్జెట్‌ని కేటాయించాలని ఆర్థికమంత్రి హరీష్‌రావును డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

అటు… ఏడోరోజు కూడా జోరు వాన, మండే ఎండను సైతం లెక్కచేయకుండా నిరసన దీక్ష కంటిన్యూ చేశారు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్. ప్రతిపక్ష పార్టీలు, స్టూడెంట్ యూనియన్లు కూడా బాసటగా నిలిచాయి. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కమిట్‌మెంటూ, వాళ్ల ఉద్యమం సాగిన తీరూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయింది.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే