Telangana Teachers: ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్.. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు రాష్ట్ర సర్కార్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో..

Telangana Teachers: ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్.. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
Teacher
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 20, 2022 | 2:58 PM

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు రాష్ట్ర సర్కార్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో సంబంధిత అధికారుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను వెంట‌నే జారీ చేయాల‌ని అధికారుల‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంద‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.

కోర్టు ఉత్తర్వులతో..

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం గత ఏడాది 317 జీవోను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ, కొంతమందిని కొత్త జిల్లాలకు పంపింది. అయితే, పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి చేశాయి. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో 2,598 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలు కోరుకునే వారి పాత సర్వీసును కొనసాగించబోమని, కొత్తగా చేరినప్పటి నుంచే సర్వీసు వర్తింపజేస్తామని ప్రభుత్వం మార్గ దర్శకాలు వెలువరించింది.

దీంతో పరస్పర బదిలీ లపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కట్టుబడి ఉంటామని అంగీ కార పత్రం ఇచ్చిన వారిని బదిలీ చేసేందుకు విద్యాశాఖ సమ్మతించింది. దీంతో 1,260 మంది ఒప్పంద పత్రాలు సమర్పించారు. వీరిని బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రమోషన్లు ఎప్పుడు..

బదిలీలు, ప్రమోషన్లను ఏక కాలంలో పూర్తి చేస్తామని గత కొన్ని నెలలుగా తెలంగాణ సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ పదోన్నతుల ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం వెలువరించలేదు. కాగా, ఈ నెలాఖరుకు పదోన్నతుల ప్రక్రియ చేపడతామని ఉపాధ్యాయ సంఘాలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇటీవల తెలిపారు.

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!