AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: హైదరాబాద్‌లో లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సాంకేతిక కేంద్రం.. లండన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకు వచ్చింది.

Minister KTR: హైదరాబాద్‌లో లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సాంకేతిక కేంద్రం.. లండన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం
Minister Ktr
Basha Shek
|

Updated on: May 13, 2023 | 6:26 AM

Share

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకు వచ్చింది. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందిని ఈ సంవత్సరాంతానికి నియమించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. మంత్రి , లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ సిఐఓ ఆంథోనీ మెక్‌కార్తీ తో జరిగిన సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎర్పాటుకు సంబంధించిన ఒక అవగాహన ఒప్పందాన్ని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్, ఎన్నారై అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఆంథోనీ మెక్‌కార్తీ మద్య మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగింది.

లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసే టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ ద్వారా హైదరాబాద్ నగరంలోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి అద్భుతమైన ఊతం లభిస్తుంది. ఈ రంగంలో హైదరాబాద్ నగరంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించనుంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ప్రపంచంలో 70 దేశాలలో ఫైనాన్షియల్ మార్కెట్ రంగంలో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దాదాపు 190 దేశాలలోని తన ఖాతాదారులకు సేవలను అందిస్తుంది. తన విస్తృతమైన కార్యకలాపాలతో ప్రపంచంలోని ఫైనాన్షియల్ సేవారంగంలో దిగ్గజ సంస్ధగా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ఒకటిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..