NTR Statue: ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం.. కరాటే కల్యాణి పెయిడ్ ఆర్టిస్టు అంటూ మండిపడుతున్న బీఆర్ఎస్ యాదవ ప్రతినిధులు
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పై వివాదం నెలకొంది..శ్రీ కృష్ణుడు రూపం లో ఉన్న విగ్రహం ఏర్పాటు పై హిందూ మరియు యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి..
ఖమ్మం లో ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ విగ్రహం పై వివాదం రాజుకుంది..శ్రీ కృష్ణుడు రూపం లో ఉన్న విగ్రహ ఏర్పాటు పై హిందూ,యాదవ సంఘాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కు వ్యతిరేకం కాదని..కృష్ణుడు రూపం లో పెట్టడం సరికాదని…అంటున్నారు..దీని వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని..యాదవ,కమ్మ సామాజిక వర్గాల ఓట్లు కోసమే ఈ రూపంలో ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు… ఖమ్మం లో ఎవరి మనోభావాలు దెబ్బతినలేదని.. కరాటే కళ్యాణి యాదవ సంఘం ముసుగులో వచ్చి..కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఖమ్మం బి ఆర్ ఎస్ లో ఉన్న యాదవ ప్రతినిధులు అంటున్నారు.
ఈ నెల 28 న విగ్రహం ఏర్పాటు
ఈ నెల 28 న ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు..మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో తానా సభ్యులు,కొందరు ఎన్నారై లు,పారిశ్రామిక వేత్తలు..సుమారు నాలుగు కోట్లతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు..జూనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొంటున్నారు..దీనికి సంబందించిన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు..54 అడుగుల ఎత్తులో శ్రీ కృష్ణుడు రూపం లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.. హైదరాబాద్ లో ఇది రూపు దిద్దుకుంటుంది..
కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో నిరసన
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పై వివాదం నెలకొంది..శ్రీ కృష్ణుడు రూపం లో ఉన్న విగ్రహం ఏర్పాటు పై హిందూ మరియు యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి..సినీనటి కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆధ్వర్యంలో హిందూ, యాదవ ఆందోళన నిర్వహించారు.. జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించారు..ప్రభుత్వ స్థలం లో ప్రైవేట్ కార్యక్రమం కు ఎలా అనుమతి ఇచ్చారు..అని ప్రశ్నించారు..
బీఆర్ఎస్ యాదవ ప్రతినిధుల స్పందన
కరాటే కళ్యాణి అభ్యంతరాలపై ఖమ్మం బీఆర్ఎస్ లో ఉన్న యాదవ ప్రతినిధులు ఘాటుగా స్పందించారు.. హైదరాబాద్ నుంచి పెయిడ్ ఆర్టిస్టు లను తీసుకు వచ్చి.. ఖమ్మం లో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆమె వ్యవహరిస్తుందని బి ఆర్ ఎస్ యాదవ ప్రతినిది పగడాల నాగరాజు తెలిపారు. ఖమ్మం లో ఉన్న యాదవులు ఎవరిని ఆమె సంప్రదించలేదని.. ఆమె వెనుక ఎవరో ఉండి రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.. సూట్ కేసు ల్లో డబ్బులు తీసుకొని.. అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
అభ్యంతరం లేదన్న యాదవ సంఘం సీనియర్
శ్రీ కృష్ణుడు రూపం లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదని యాదవ సంఘం సీనియర్ నేత కూరాకుల నాగ భూషణం తెలిపారు..ఏపి లో విగ్రహాలు పెట్టినపుడు కరాటే కళ్యాణి ఎక్కడ కు వెళ్లారని ప్రశ్నించారు..విగ్రహ ఏర్పాటు పై రాజకీయం చేయడం తగదన్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహం ఏర్పాటు ను ఆపమని..స్పష్టం చేశారు. అభిమానం తోనే విగ్రహం పెడుతున్నాం..ఇందులో ఎలాంటి రాజకీయం లేదని అంటున్నారు..మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుంది..చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..