Unique Love: ఖండాంతరాలు దాటున్న పెళ్లిళ్లు.. తెలుగబ్బాయికి మెక్సికో అమ్మాయితో వివాహం..
ప్రస్తుతం ప్రేమ కుల మతాలకు అతీతకంగా ఖండాలు దాటుతోంది. తాము పనిచేసే చోట లేదా.. చదువుకుంటున్న సమయంతో ఏర్పడిన పరిచయాలు పేమగా మారుతున్నాయి. జాతి, మతం, కులం వంటి బేధాలను పక్కకు పెట్టి ప్రేమని పండించుకోవాలని.. పెళ్లి చూసుకోవాలని భావిస్తున్నారు నేటి యువతి యువకులు.. తమ పిల్లల ప్రేమకు పెద్దలు కుడా పచ్చజెండా ఊపుతున్నారు.
ఒకప్పుడు పెళ్లి చేయాలంటే తెలిసిన వాళ్లలోనో… ఊర్లోనో పూజారుల ద్వారానో సంబంధం వెతికేవారు. కాలక్రమంలో జరిగిన మార్పుల్లో భాగంగా పెళ్లిళ్ల కోసం.. పెళ్లిళ్ల పేరయ్యలను, మ్యారేజ్ బ్యూరోలను ఆశ్రయించేవారు.. ఇప్పుడు సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమలు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభమైంది. ప్రేమ వివాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి, చదువుల కోసం విదేశాల బాటపడుతున్నారు నేటి యువత.. దీంతో అలాంటి ప్రేమ వివాహనికి హైదరాబాద్ వేదికగా మారింది. తెలుగబ్బాయి మేక్సిన్ అమ్మాయిల పెళ్లి హిందూ సంప్రదాయంలో అంగరంగ వైభవంగా జరిగింది. హిమాయత్ నగర్ లోని ఓ ప్రైవేటు హోటల్ లో ప్రేమికులు ఒక్కటయ్యారు. అంబర్ పేట్ కి చెందిన యోల్లంకి సమ్మక్క, మల్లయ్య దంపతుల కుమారుడు సందీప్ కుమార్, మెక్సికో కు చెందిన లొరేన రోడ్రిగేజ్ మజోకో- హువాన్ అల్బెరోటో అబుదొ మెనా దంపతుల పుత్రిక లొరాన్స్ వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో సందీప్ లోరాన్స్ మెడలో మూడు ముళ్ళు వేసాడు.
సందీప్‌కుమార్ మెక్సికోలోని విశ్వవిద్యాలయంలో పీజీ చదవడానికి వెళ్ళాడు. అక్కడ లొరాన్స్తో స్నేహం ఏర్పడింది. ప్రేమించుకున్నారు. ఇరువు తమ తల్లిదండ్రులను ఒప్పించి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..