Warangal: అయ్యో భగవంతా ఈ చిట్టి తల్లి ఏం పాపం చేసిందయ్యా..? కూల్ డ్రింక్ అనుకుని టిన్నర్ తాగడంతో
భగవంతుడా ఆ చిన్నారి ఏం పాపం చేసిందయ్యా..? చిన్న నిర్లక్ష్యం పెను ప్రమాదానికి కారణమైంది. కూల్ డ్రింక్ అనుకుని ఈ చిట్టి తల్లి కెమికల్ తాగడంతో మరణించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..
ఒక వయసు వచ్చేవరికి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారికి మంచి ఏదో, చెడు ఏదో తెలీదు. జాగ్రత్తగా సంరక్షించుకోకపోతే పెను ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంది. తాజాగా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జాఫర్ పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారి సౌమ్య కూల్ డ్రింక్ అనుకొని టిన్నర్ కెమికల్ తాగింది. ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా తలుపులకు రంగులు వేస్తుండగా తెలియక టిన్నర్ తాగింది చిన్నారి. వెంటనే ఎంజిఎం ఆస్పత్రికి వెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ పాప మృతి చెందింది. దీంతో పెళ్లి ఇంట పెను విషాదం జరిగినట్లు అయ్యింది. బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అప్పటివరకు తమ కళ్ల ముందు ఉన్న బిడ్డ.. ఇక లేదు అంటే తట్టుకోలేకపోతున్నారు.
అందుకే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అప్రమత్తత అవసరం. ఒక మనిషి నిరంతరం వారిని గమనిస్తూనే ఉండాలి. ప్రమాదాలు మన పక్కనే ఉంటాయి. ఇటీవల ఓ తల్లి వాటర్ హీటర్ పెట్టి.. వాష్ రూమ్‌కి వెళ్లింది. బెడ్‌పై ఆడుకుంటున్న చిన్నారి దొర్లుకుంటూ వచ్చి.. ఆ వాటర్ హీటర్ బకెట్‌లో పడింది. దీంతో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఇక ఈ కెమికల్స్ లేదా ఎలుకలు, చీమల మందులు, క్రిమి సంహారక మందుల డబ్బాలు.. పిల్లలు ఉన్న ఇంట్లో సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. పిల్లలు ఏది కనపడ్డా నోట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. సో పేరెంట్స్ బీ అలర్ట్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..