Telangana: త్వరలో తెలంగాణకు రానున్న ఎయిర్ అంబులెన్స్‌లు.. మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన

తెలంగాణలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా ఆరోగ్య సూచికల్లో తెలంగాణ మూడవ స్థానానికి చేరుకుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో వచ్చినటువంటి మార్పుల పైన జరిగిన అభివృద్ధి పైన మంత్రి హరీష్ రావు ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఆరోగ్య తెలంగాణ వైద్యానికి శాఖ నివేదికను మంత్రి హరీష్ రావు ఈరోజు విడుదల చేశారు.

Telangana: త్వరలో తెలంగాణకు రానున్న ఎయిర్ అంబులెన్స్‌లు.. మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన
TS Minister Harish Rao
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Aravind B

Updated on: Sep 25, 2023 | 4:30 PM

తెలంగాణలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా ఆరోగ్య సూచికల్లో తెలంగాణ మూడవ స్థానానికి చేరుకుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో వచ్చినటువంటి మార్పుల పైన జరిగిన అభివృద్ధి పైన మంత్రి హరీష్ రావు ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఆరోగ్య తెలంగాణ వైద్యానికి శాఖ నివేదికను మంత్రి హరీష్ రావు ఈరోజు విడుదల చేశారు. తలసరి ఆరోగ్య బడ్జెట్ రాష్ట్ర విభజన సమయంలో 925 రూపాయలు ఉండగా అది ఇప్పుడు 35,322 రూపాయలకు చేరుకుందని అన్నారు మంత్రి. వైద్యాశాఖ ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ప్రతి విషయంలోనూ అభివృద్ధి సాధించిందని..ప్రభుత్వ ఆసుపత్రుల పడకల దగ్గర నుంచి మెడిసిన్, ఆసుపత్రుల వసతులు,వైద్యంతో పాటు వైద్య విద్య, మెడికల్ కాలేజీల సీట్లు ఇలా ఒక్కటి కాదు వైద్యరంగంలో అన్ని రకాల అభివృద్ధి సాధించి తెలంగాణ దేశానికే మోడల్ గా నిలిచిందని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ నివేదికలో తెలియజేశారు.

ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో 22వేల మందికి ఉద్యోగ కల్పన చేశామని మరొక 7000 వరకు ఉద్యోగ కల్పనకు అవకాశం ఉందని మంత్రి హరీష్ రావు తన నివేదికలో తెలియజేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో కేవలం ఐదు ఐసీయూలు ఉంటే ఇప్పుడు వాటిని ఏకంగా 80కి పెంచుకున్నామని పేర్కొన్నారు. అలాగే 108 అంబులెన్సులు,నియోనాటల్ వాహనాలు, అమ్మఒడి వాహనాలు, పరమపద వాహనాలు ఇలా అన్ని రకాల వైద్య సేవలకు ఉపయోగపడేటువంటి వాహనాలన్నింటిని కొత్తగా అందుబాటులోకి తెచ్చుకున్నామని.. అలాగే ఉన్నవాటిని పెంచుకున్నాము అని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలోకి పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో భాగంగా ఎయిర్ అంబులెన్స్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఎయిర్ అంబులెన్స్ అంటే డబ్బున్న వాళ్లకి వీవీఐపీ లకి జబ్బు చేస్తే వైద్య సదుపాయం కోసం ఆసుపత్రికి తరలించేందుకు ఈ అంబులెన్స్‎లని అప్పుడప్పుడు యూస్ చేస్తుంటారు. కానీ మాకు తెలంగాణ ప్రజలే vipలు. వారి ఆరోగ్యమే మాకు ప్రధానం. అందుకోసం త్వరలో ఎయిర్ ఆంబులెన్స్‎లను ప్రవేశపెట్టనున్నామని దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. నిజంగా ఎయిర్ ఆంబులెన్స్‎లు తెలంగాణలో అమల్లోకి వస్తే ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకు ఎక్కుతుంది.