AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.1500 అప్పు చెల్లించలేదనీ! దళిత మహిళను వివస్త్రను చేసి, మూత్రం తాగించి..

చంద్రుడిపై ప్రయోగాలు చేసే స్థాయికి మన దేశం ఎదిగినా.. భావజాలాల్లో మాత్రం కొందరు ఇప్పటికీ అనాగరికుల్లా జీవిస్తున్నారు. సభ్యసమాజం తల దించుకునేలా తోటి మనుషులను హింసిస్తున్నారు. తాజాగా బీహార్‌లోని పట్నాలో శనివారం (సెప్టెంబర్‌ 23) రాత్రి దారుణ ఘటన వెలుగు చూసింది. రూ.1500 అప్పు చెల్లించలేదని ఈ దళిత మహిళను అగ్రకులస్థులు దారుణంగా అవమానించారు. అందరు చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేసి కర్రలతో చితకబాదారు. అనంతరం ఆమెతో బలవంతంగా..

రూ.1500 అప్పు చెల్లించలేదనీ! దళిత మహిళను వివస్త్రను చేసి, మూత్రం తాగించి..
Dalit Woman Stripped And Beaten In Patna
Srilakshmi C
|

Updated on: Sep 25, 2023 | 10:16 AM

Share

పట్నా, సెప్టెంబర్‌ 25: చంద్రుడిపై ప్రయోగాలు చేసే స్థాయికి మన దేశం ఎదిగినా.. భావజాలాల్లో మాత్రం కొందరు ఇప్పటికీ అనాగరికుల్లా జీవిస్తున్నారు. సభ్యసమాజం తల దించుకునేలా తోటి మనుషులను హింసిస్తున్నారు. తాజాగా బీహార్‌లోని పట్నాలో శనివారం (సెప్టెంబర్‌ 23) రాత్రి దారుణ ఘటన వెలుగు చూసింది. రూ.1500 అప్పు చెల్లించలేదని ఈ దళిత మహిళను అగ్రకులస్థులు దారుణంగా అవమానించారు. అందరు చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేసి కర్రలతో చితకబాదారు. అనంతరం ఆమెతో బలవంతంగా మూత్రం తాగించారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో బాధిమాత మహిళ ప్రాణాలతో పోరాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బీహార్‌లోని పట్నాకు చెందిన ఓ మహిళ కొన్ని నెలల క్రితం ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద వడ్డీకి రూ.9000 అప్పుగా తీసుకుంది. అయితే ఆ మొత్తం నగదును వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. అయినప్పటికీ ప్రమోద్‌ సింగ్‌ అదనంగా రూ.1500 డబ్బు చెల్లించాలని మహిళను డిమాండ్‌ చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఎక్కువ డబ్బులు ఇవ్వకుంటే వివస్త్రను చేసి ఊరంతా ఊరేగిస్తానని ప్రమోద్ సింగ్‌ మహిళను పలుమార్లు బెదిరించాడు. ఈ బెదిరింపులపై మహిళ గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రెచ్చిపోయిన నిందితుడు ప్రమోద్‌ సింగ్‌, అతని కుమారుడు అన్షు, మరో నలుగురు సహచరులతో కలిసి శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో దళిత మహిళ ఇంటికి వెళ్లి బలవంతంగా ఆమెను ఇంటి నుంచి బయటకు లక్కొచ్చారు. ఆమెపై దారుణంగా దాడి చేసి వివస్త్రను చేసి, కర్రలతో తీవ్రంగా కొట్టారు. అనంతరం నిందితుడు ప్రమోద్ సింగ్ మహిళ నోటిలో మూత్ర విసర్జన చేయాలని తన కుమారుడు అన్షుకి పురమాయించాడు.

ఇంతలో బాధితురాలు వారి చెర నుంచి తప్పించుకుని పోలీస్‌ స్టేషన్‌కు పరుగు తీసింది. ఈ ఘటనలో మహిళ తలకు బలమైన గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతరం బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ప్రధాన నిందితుడితోపాటు అతని కుమారుడు, సహకరించిన నలుగురూ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ ఫతుహా ఎస్ యాదవ్ తెలిపారు. స్వతంత్ర భారత దేశంలో ఓ మహిళను బహిరంగంగా అవమానపరిస్తే ఇదేంటని ప్రశ్నించినవారు లేకపోవడం అంతకు మించిన దారుణంగా పరిణమించిందంటూ బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి యోగేంద్ర పాశ్వాన్ ఈ ఘటనను ఖండించారు. ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లపై మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.