AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్.. దేశానికే రోల్ మోడల్..! అందుబాటులో వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌.. ఎక్కడంటే..

Integrated Market: దేశంలో ఇప్పటివరకు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా కోయంబత్తూర్ మార్కెట్ కు పేరు ఉంది. దీనిని తలదన్నేలా ఇక్కడి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను నిర్మించారు. విద్యుత్ అవసరం లేకుండానే సహజ సిద్ధమైన వెలుతురుతో మార్కెట్ ను ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొట్ట మొదటిసారి.

Telangana: ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్.. దేశానికే రోల్ మోడల్..! అందుబాటులో వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌.. ఎక్కడంటే..
Suryapet Integrated Market
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 25, 2023 | 3:30 PM

Share

నల్గొండ, సెప్టెంబర్‌25; సాధారణంగా కూరగాయల మార్కెట్ అంటేనే చిర్రెత్తుకొస్తుంది. మరీ ముఖ్యంగా చేపలు, నాన్ వెజ్ మార్కెట్ అంటేనే ఈగల మోత, దుర్వాసనతో నిండి ఉంటుంది. కానీ, ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్‌ నాన్ వెజ్ మార్కెట్ లో మాత్రం విద్యుత్తు లేకుండానే వెలుతురు, చల్లటి గాలి కలిగి ఉంది. అంతేకాదు.. ఇది ఆసియాలోనే ఇది అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని మీకు తెలుసా..? దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్న ఈ వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎక్కడుందో తెలుసా..? దీని ప్రత్యేకతలు ఏంటో..? ఇక్కడ తెలుసుకుందాం..

వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ గ్రీన్ మార్కెట్ ను నిర్మించారు. 30 కోట్ల రూపాయల వ్యయంతో ఆరు ఎకరాల్లో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం జరిగింది. ఇందులో ఐదు బ్లాక్ లతో 264 దుకాణాలను నిర్మించారు.

జర్మన్ టెక్నాలజీతో 10 ఎంఎం మందం యువి ఆల్ట్రా వైలెట్ ఫిల్టర్ డుమ్ స్కైలాట్ గా ఏర్పాటు చేశారు. దీంతో సూర్యకాంతి పైపులు ప్రత్యేక లెజర్ బ్లో పైప్ ద్వారా ప్రతి దుకాణంలో రోజుకు 9 నుంచి 10 గంటల పాటు పగటి వెలుగులు ప్రసరించేలా ఏర్పాటు చేశారు. సహజ సిద్ధమైన (స్కైలేట్) వెలుతురుతో విద్యుత్ లైట్స్ తో పని లేకుండా సహజ కాంతి పడేలా డిజైన్ చేసి నిర్మించారు. అలాగే ఆరు ఎయిర్ వెంటిలేటర్ బ్లోయర్స్ తో నిమిషానికి 26 సార్లు లోపలి గాలిని ఫిల్టర్ చేసి బయటకు పంపేలా ఎయిర్ వెంటిలేషన్ సిస్టం ఏర్పాటు చేశారు. దీంతో దుకాణాల్లో ఎప్పుడు 24 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో మొత్తం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో విద్యుత్ దీపాల అవసరం లేదు. ఈ భవనంలో వెలుతురు కోసం ఒక్క విద్యుత్ యూనిట్ కూడా వినియోగించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

దేశంలో ఇప్పటివరకు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా కోయంబత్తూర్ మార్కెట్ కు పేరు ఉంది. దీనిని తలదన్నేలా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను నిర్మించారు. విద్యుత్ అవసరం లేకుండానే సహజ సిద్ధమైన వెలుతురుతో మార్కెట్ ను ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొట్ట మొదటిసారి. సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కు ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ గా పేరు ఉంది. ఈ మార్కెట్ ను ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో ఈ మార్కెట్ లోని దుకాణాలను చిరు వ్యాపారులకు కేటాయించనున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..