వామ్మో.. ఈ ఊరు నిద్రపోతే కుంభకర్ణుడి కంటే ఎక్కువే..! ఆ తర్వాత ఏమీ గుర్తుండదు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

కుంభకర్ణుడిని కూడా మించిపోయిన ప్రజలు నివసించే గ్రామం ప్రపంచంలోనే ఉందని మీకు తెలుసా..? ఇక్కడ ప్రజలు కుంభకర్ణుడి నిద్రను మించిపోయారంటే నమ్మాల్సిందే..వింత నిద్ర సమస్యతో బాధపడే ఇక్కడి ప్రజలు నడిచేటప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా, ఎక్కడ పడితే అక్కడే నిద్రలోకి జారుకుంటారు.

వామ్మో.. ఈ ఊరు నిద్రపోతే కుంభకర్ణుడి కంటే ఎక్కువే..! ఆ తర్వాత ఏమీ గుర్తుండదు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Mysterious Village
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 24, 2023 | 10:11 PM

మనిషికి ఊపిరి పీల్చుకోవడం, తినడం, నీళ్లు తాగడం ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరమని శాస్త్రాలు, గ్రంధాలలో వివరించబడింది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా ముఖ్యం అంటారు. కానీ, ప్రస్తుత బిజీ లైఫ్‌, పని భారం వల్ల మనం చాలా మంది సరైన నిద్రకు దూరమవుతున్నారు. భోజనం, నిద్ర గురించి ప్రస్తావించినప్పుడల్లా కుంభకర్ణుడుని గుర్తుకు చేసుకుంటారు. రావణుని సోదరుడు కుంభకర్ణుడు నిద్రకు ప్రసిద్ధి చెందాడు. అతను సంవత్సరంలో 6 నెలలు నిద్రపోయాడు. 6 నెలలు మేల్కొని ఉన్నాడు. అయితే కుంభకర్ణుడిని కూడా మించిపోయిన ప్రజలు నివసించే గ్రామం ప్రపంచంలోనే ఉందని మీకు తెలుసా..? ఇక్కడ ప్రజలు కుంభకర్ణుడి నిద్రను మించిపోయారంటే నమ్మాల్సిందే.. ఈ గ్రామం కజకిస్తాన్‌లోని కలాచి గ్రామం. ఇక్కడ ప్రజలు నెలల తరబడి నిద్రపోతారు. దీని కారణంగానే ఈ ఊరికి స్లీపీ హాలో విలేజ్ అనే పేరు కూడా ఉంది. అతి నిద్ర కారణంగా ఇక్కడి ప్రజలపై ఎన్నో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. అయినప్పటికీ సరైన సమాధానం దొరకలేదని తెలిసింది.

కొంతమంది శాస్త్రవేత్తలు ఈ గ్రామంలో చాలా పురాతనమైన యురేనియం గని ఉందని చెబుతారు. దీని కారణంగానే అక్కడ నుంచి విషవాయువులు వస్తుంటాయని చెబుతున్నారు. ఆశ్చర్యకరంగా ఏళ్ల తరబడి వినియోగించకపోవడంతో ఇక్కడి నీరు కూడా పూర్తిగా కలుషితమైపోయింది. అందుకే దీని ప్రభావానికి లోనైన వ్యక్తులు నెలల తరబడి నిద్రపోతారు. ఈ గ్రామంలో గాలి, నీటి వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని సమాచారం.

ఇక్కడ మనుషులే కాదు జంతువులు కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది కాకుండా, ఒకసారి ఇక్కడ పడుకున్న వ్యక్తికి ఆ తర్వాత  ఏమీ గుర్తుకు రాదు. ఊరందరికీ నిద్ర లేచే సరికి ఏం జరిగిందో వారికి గుర్తుకు ఉండదు… వింత నిద్ర సమస్యతో బాధపడే ఇక్కడి ప్రజలు నడిచేటప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా, ఎక్కడ పడితే అక్కడే నిద్రలోకి జారుకుంటారు. ఖాళీ యురేనియం గనుల వరదలు, విషపూరిత వాయువులను లీక్ చేయడం వల్ల ప్రతిచర్య సంభవించిందని పరిశోధకులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..