AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆఖరి మజిలీ కోసం.. ఊరు ఊరంతా ఒక్కటైంది.. శ్మశానం కోసం సిరికొండ పోరాటం

ఆరేళ్లుగా గ్రామస్తులంతా శ్మశానం కోసం పంచాయతీ లు నిర్వహించినా.. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా లాభం లేకుండా పోయింది. శనివారం ఓ వ్యక్తి చనిపోవడంతో అంత్యక్రియలు జరిపేందుకు శ్మశాన స్థలానికి తరలించగా సదరు వ్యక్తి మరోసారి అడ్డు తగిలాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఎదురు తిరిగారు.

Telangana: ఆఖరి మజిలీ కోసం.. ఊరు ఊరంతా ఒక్కటైంది.. శ్మశానం కోసం సిరికొండ పోరాటం
Controversy Over Graveyard
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 25, 2023 | 3:00 PM

Share

ఆదిలాబాద్,సెప్టెంబర్25; మనిషి ఆకరి మజిలీ అది.. శాశ్వతంగా ప్రశాంతంగా నిద్రపోయే స్థలమది.. కానీ, ఆ చివరి ప్రయాణంలో చేరే గమ్య స్థలం అక్కడ వివాదాలకు కారణమైంది. ఈ‌ స్థలం నాదంటూ ఓ వ్యక్తి హద్దులు పాతడంతో ఊరు రెండుగా చీలింది. ఊరికి ఉత్తరాన ఉన్న ఈ స్థలం శ్మశానాకి దక్కాల్సిందే అంటూ చివరికి ఊరు ఊరంతా ఒక్కటైంది. శ్మశాన స్థలాన్ని కబ్జా చేశాడంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. శ్మశానం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్దం అంటూ ప్రకటించింది ఆ గ్రామం.

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో స్మశాన వాటిక స్థలం వివాదస్పదంగా మారింది. శతాబ్ద కాలంగా శ్మశానంగా కొనసాగుతున్న స్థలాన్ని ఓ వ్యక్తి గత ఆరేళ్ల క్రితం కబ్జా చేశాడు. రెవెన్యూ రికార్డ్ ల ప్రకారం పంట పొలం పక్కనే ఉన్న 79 సెంట్ల భూమిని తనదేనంటూ బుకాయిస్తూ.. గత ఆరేళ్లుగా అంత్యక్రియలకు అడ్డుపడుతూ వస్తున్నాడు. శ్మశానానికి స్థలం కరువవడంతో ఎవరు చనిపోయినా అంతిమ సంస్కరాలకు స్థలం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పడం లేదు. దీంతో విసిగి వేశారిన గ్రామస్తులంతా ఒక్కటై శ్మశాన‌ స్థలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పోరాటానికి దిగారు. కబ్జాకు గురైన భూమిలో గ్రామస్తులంతా కట్టెలు పాతి శ్మశాన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆరేళ్లుగా గ్రామస్తులంతా శ్మశానం కోసం పంచాయతీ లు నిర్వహించినా.. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా లాభం లేకుండా పోయింది. శనివారం ఓ వ్యక్తి చనిపోవడంతో అంత్యక్రియలు జరిపేందుకు శ్మశాన స్థలానికి తరలించగా సదరు వ్యక్తి మరోసారి అడ్డు తగిలాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఎదురు తిరిగారు. గ్రామస్తుల సమిష్టితో అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం సమావేశమైన గ్రామస్తులు శ్మశాన స్థలంలో హద్దులు పాతాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడువుగా ఊరు ఊరంతా ఒక్కటై శ్మశాన స్థలానికి‌ చేరుకుని కర్రలతో హద్దులు పాతారు. ఈ స్థలంలోకి గ్రామస్తుల అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించినా చర్యలు తప్పవంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో ఆరేళ్లుగా కొనసాగుతున్న శ్మశాన స్థల వివాదం ఒక కొలిక్కి వచ్చింది.

అయితే స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తి మాత్రం న్యాయపోరాటం చేస్తానంటూ చెబుతన్నాడు.. దీంతో శ్మశాన స్థల వివాదం మరో మలుపు తిరిగినట్టైంది. చూడాలి మరీ సిరికొండకు చివరి మజిలీ ఇప్పటికైనా దక్కుతుందో లేదో.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..