- Telugu News Photo Gallery Turmeric Price Hike: Turmeric price hiked by 180 percent in last 4 months, know why
Turmeric Price: కేవలం నాలుగు నెలల్లోనే అమాంతంగా పెరిగిన పసుపు ధరలు.. కారణం ఇదే!
గడచిన నాలుగు నెలల వ్యవధిలో పసుపు ధర ధర దాదాపు 180 శాతం పెరిగింది. దీంతో సామాన్యులు పసుపు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే బియ్యం, గోధుమలు, పంచదార మొదలుకొని కూరగాయల వరకు అనేక ఆహార పదార్థాల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. మొన్నటి వరకు టమాట ధరలు దేశ వ్యాప్తంగా హడలెత్తించాయి. ప్రస్తుతం ఉల్లి కూడా టమాటా బాటలోనే పయనిస్తోంది..
Updated on: Sep 25, 2023 | 12:56 PM

గడచిన నాలుగు నెలల వ్యవధిలో పసుపు ధర ధర దాదాపు 180 శాతం పెరిగింది. దీంతో సామాన్యులు పసుపు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే బియ్యం, గోధుమలు, పంచదార మొదలుకొని కూరగాయల వరకు అనేక ఆహార పదార్థాల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. మొన్నటి వరకు టమాట ధరలు దేశ వ్యాప్తంగా హడలెత్తించాయి. ప్రస్తుతం ఉల్లి కూడా టమాటా బాటలోనే పయనిస్తోంది.

దాంతో మసాలాల ధర తలనొప్పిగా మారింది. గత నాలుగు నెలలుగా పసుపు ధర గణనీయంగా పెరగడంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో పసుపు ధర క్వింటాల్‌కు రూ.18 వేలకు చేరుకుంది. దీంతో సామాన్యుడు కొనలేక తినలేక ఆందోళన చెందుతున్నాడు.

ప్రతి వంటింట్లో పసుపు చాలా ఉపయోగకరమైన వస్తువు. ఇది లేకుండా రుచికరమైన కూరలను తయారు చేయడం దాదాపు అసాధ్యం. దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ పెరగడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మంచింది. పేద, ధనవంతులు అన్న తేడా లేకుండా ఉపయోగించే సుగంధ ద్రవ్యం పసుపు.

పసుపు టీ తాగడం ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేయవచ్చు. ఒక్కొక్క ముక్క చొప్పుఉన తాజా పసుపు, అల్లం తీసుకుని 2 కప్పుల నీళ్లలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ నీటిని మరిగించి వడకట్టాలి. అందులో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల అజీర్ణం, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

అలాగే ఎల్‌నినో కూడా దిగుబడిపై ప్రభావం చూపిందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా మన దేశం నుంచి పసుపు కూడా పెద్దఎత్తున ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మొత్తం ఉత్పత్తిలో 16.87 శాతం పసుపు విదేశాలకు ఎగుమతి అయింది. దక్షిణ భారతదేశంలో పసుపు ఉత్పత్తి 45 నుండి 50 శాతానికి తగ్గింది.





























