- Telugu News Photo Gallery Side Effects Of Cream Biscuits: What Happen if You Eat Cream Biscuits Every Day, know here
Cream Biscuits: మీరూ క్రీమ్ బిస్కెట్లు తింటున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే..
చాలా మంది బిస్కెట్లు ఇష్టంగా తింటుంటారు. క్రీమ్ బిస్కెట్లు, సాల్ట్ బిస్కెట్లు, బేకరీ బిస్కెట్లు, క్రీమ్ క్రాకర్లు, మేరీ బిస్కెట్లు ఇలా ఆకలిగా అనిపించిన ప్రతిసారి ఇష్టమైన బిస్కెట్లు లాగించేస్తుంటారు. సాధారణంగా బిస్కెట్లు మనకు ఆల్ టైమ్ ఫేవర్ స్నాక్స్. బిస్కెట్ ప్యాకెట్, ఓ నీళ్ల బాటిల్ ఉంటే చాలు ఆకలి క్షణాల్లో మాయం అవుతుంది. చాలా మంది ఒకేసారి ప్యాకెట్‌లోని 8-10 బిస్కెట్లు తింటుంటారు. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా తినడం వల్ల శరీరానికి అనేక విధాలుగా ..
Updated on: Sep 25, 2023 | 12:09 PM

చాలా మంది బిస్కెట్లు ఇష్టంగా తింటుంటారు. క్రీమ్ బిస్కెట్లు, సాల్ట్ బిస్కెట్లు, బేకరీ బిస్కెట్లు, క్రీమ్ క్రాకర్లు, మేరీ బిస్కెట్లు ఇలా ఆకలిగా అనిపించిన ప్రతిసారి ఇష్టమైన బిస్కెట్లు లాగించేస్తుంటారు. సాధారణంగా బిస్కెట్లు మనకు ఆల్ టైమ్ ఫేవర్ స్నాక్స్. బిస్కెట్ ప్యాకెట్, ఓ నీళ్ల బాటిల్ ఉంటే చాలు ఆకలి క్షణాల్లో మాయం అవుతుంది.

చాలా మంది ఒకేసారి ప్యాకెట్‌లోని 8-10 బిస్కెట్లు తింటుంటారు. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా తినడం వల్ల శరీరానికి అనేక విధాలుగా హాని తలపెడుతుందట. ముఖ్యంగా జీర్ణ సమస్యలు రావచ్చు, మలబద్ధకం సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు.

ముఖ్యంగా క్రీమ్ బిస్కెట్లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫ్యాట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో క్రీమ్ బిస్కెట్లు తింటే బరువు వేగంగా పెరుగుతారట.

బరువు పెరగడం వల్ల ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయి. అందువల్లనే ఆకలిగా అనిపించినప్పుడు బిస్కెట్లు లాగించేయకూడదట. పొరపాటున కూడా క్రీమ్ బిస్కెట్లు తినకూడదు. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని సైతం పెంచుతుంది.క్రీమ్ బిస్కెట్ల తీపి రుచి మరింతగా ఆకట్టుకుంటుంది. ఈ బిస్కెట్‌లోని తీసి సమస్యకు ప్రధాన కారణం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రకమైన బిస్కెట్ కడుపులోకి చేరిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతుంది. షుగర్ ఉన్నవారు క్రీమ్ బిస్కెట్లు తినకూడదు.

క్రీమ్ బిస్కెట్లలో బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీయానిసోల్, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీటోల్యూన్ అనే రెండు పదార్థాలు ఉంటాయి. ఈ రెండు శరీరానికి చాలా హానికరం. బిస్కెట్లను మైదా పిండితో తయారు చేస్తారు. కానీ ఓట్స్‌తో తయారు చేసిన బిస్కెట్లలో క్రీమ్ ఉండదు. మైదాతో తయారు చేసే క్రీమ్ బిస్కెట్లలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది.




