రాత్రిళ్లు కంటి నిండా నిద్రపట్టకపోయినా.. పని ఒత్తిడి, ఎక్కువ సేపు ల్యాప్‌టాప్ లేదా మొబైల్ స్క్రీన్ చూడటం.. వంటి పలు కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. లైఫ్‌స్టైల్ డార్క్ సర్కిల్స్ సమస్య మరింత తీవ్రతరం చేస్తుంది. అయితే, ఇది కేవలం స్ట్రెస్, నిద్రలేమి, స్క్రీన్ చూడటం వల్ల మాత్రమే కాకుండా శరీరంలో పోషకాహార లోపం వల్ల కూడా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.