Telangana: దేశంలోనే ఇది మొదటిసారి.. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అరుదైన రికార్డ్
హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే తలమానికంగా నిలుస్తోంది. 2022 ఆగస్టులో దీన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 5 టవర్స్‌తో దీన్ని నిర్మించారు. అయితే ప్రస్తుతం టవర్ 'ఏ' పూర్తి స్థాయిలో నడుస్తోంది. అందులో దాదాపుగా 800 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.. ఇక టవర్ 'బి' లో రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతోపాటు.. ఆ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు ఉండబోతున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే తలమానికంగా నిలుస్తోంది. 2022 ఆగస్టులో దీన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 5 టవర్స్‌తో దీన్ని నిర్మించారు. అయితే ప్రస్తుతం టవర్ ‘ఏ’ పూర్తి స్థాయిలో నడుస్తోంది. అందులో దాదాపుగా 800 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.. ఇక టవర్ ‘బి’ లో రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతోపాటు.. ఆ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు ఉండబోతున్నారు. ఇక తెలంగాణ స్టేట్ బ్యూరోతో పాటు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం ప్రత్యేక ఫ్లోర్లను కేటాయించారు. ఇక హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో ఉన్న అన్ని సిసిటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. మూడు విభాగాలుగా సిసిటీవీ కెమెరాలను ఇన్స్‌స్టాల్ చేశారు. సిటీ వైడ్ సర్వేలైన్స్ తో పాటు కమ్యూనిటీ సిసిటీవీ కెమెరాస్, సేఫ్ సిటీ సిసిటీవీ కెమెరాస్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఐదు లక్షలు సీసీ కెమెరాలు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయి. వచ్చే గణేష్ నిమజ్జన ప్రాసెస్ అంతా బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షించేందుకు పోలీసులు సన్నహాలు చేస్తున్నారు.
ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసి బంజారాహిల్స్ నుండే మానిటర్ చేసే విధంగా మల్టీ ఏజెన్సీ ఆపరేటింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒకేసారి స్క్రీన్ మీద 108 కి పైగా కెమెరా ఫుటేజ్‌లను వీక్షించే టెక్నాలజీని తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నగరంలోని జంక్షన్ల వద్ద సిసిటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయి. వీటిలో 38 ఫేషియల్ రికగ్నైజింగ్ కెమెరాలు ఉన్నాయి. ఏదైనా విపత్కర సందర్భాల్లో ఈ కెమెరాలు అన్నిటింని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వీటి ఫుటేజ్‌ను అనుసంధానం చేసి పర్యవేక్షించనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ ఆర్ఎంబీ ఆర్టీసీ మెట్రో రైల్వే అన్ని విభాగాలకు సంబంధించిన అధికారుల కోసం ఇందులో ప్రత్యేక ఫ్లోర్లను కేటాయించారు. విపత్కర సమయంలో వీరందరూ పోలీసులతో కలిసి సమన్వయం చేసుకునేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
విదేశీ తరహాలో పోలీస్ కమ్యాండ్ కంట్రోల్ సెంటర్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ముందే ఐదు సంవత్సరాల క్రితం విదేశీ పర్యటనకు కొంతమంది అధికారులను పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. విదేశాల్లో అమలయ్యే పోలీసింగ్ సిస్టంతో పాటు అక్కడున్న పరికరాలను అధ్యయనం చేయాల్సిందిగా ఈ అధికారులకు ప్రభుత్వం సూచించింది. అప్పటి పోలీస్ ఉన్నతాధికారులు పలు దేశాలు సందర్శించి ఆయా చోట్ల ఉన్న పోలీసింగ్ పై పూర్తి అవగాహన వచ్చిన తరువాత బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అలాంటి టెక్నాలజీని ఉపయోగించారు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈ డేటా అంతా తొలగిపోకుండా సైబరాబాద్‌లో ఆక్టివ్ డిజాస్టర్ రికవరీ సిస్టంను ఏర్పాటు చేశారు.