Supreme Court: సుప్రీంకోర్టులో అరుదైన సన్నివేశం.. దివ్యాంగురాలైన న్యాయవాది కోసం ఏం చేశారంటే..?

సుప్రీం కోర్టులో ఓ అరుదైన సన్నివేశం జరిగింది. దివ్యాంగురాలైనటువంటి ఓ న్యాయవాది కోసం ప్రత్యేకంగా సైన్‌ లాంగ్వేజ్‌ నిపుణుడిని ఏర్పాటు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన సారా సన్నీ అనే మహిళ పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతోంది. అయినప్పటికీ కూడా ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. పట్టుదలతో చదివి న్యాయ విద్యను పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం ఆమె ప్రముఖ న్యాయవాది సంచిత ఐన్ దగ్గర జూనియర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Supreme Court: సుప్రీంకోర్టులో అరుదైన సన్నివేశం.. దివ్యాంగురాలైన న్యాయవాది కోసం ఏం చేశారంటే..?
Supreme Court of India
Follow us
Aravind B

|

Updated on: Sep 25, 2023 | 6:09 PM

సుప్రీం కోర్టులో ఓ అరుదైన సన్నివేశం జరిగింది. దివ్యాంగురాలైనటువంటి ఓ న్యాయవాది కోసం ప్రత్యేకంగా సైన్‌ లాంగ్వేజ్‌ నిపుణుడిని ఏర్పాటు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన సారా సన్నీ అనే మహిళ పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతోంది. అయినప్పటికీ కూడా ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. పట్టుదలతో చదివి న్యాయ విద్యను పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం ఆమె ప్రముఖ న్యాయవాది సంచిత ఐన్ దగ్గర జూనియర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం పూట ఓ కేసు విచారణలో భాగంగా సంచిత ఐన్‌తో కలిసి సారా సన్నీ కోర్టుకు వచ్చారు. ఆ కోర్టులో జరిగే వాదోపవాదనులు ఆమెకు అర్థం అయ్యేందుకు సంచితా ఐన్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఓ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ వ్యాఖ్యాత సౌరవ్‌ రాయ్‌ చౌధురిని ఏర్పాటు చేశారు.

అయితే కోర్టులో వర్చువల్‌ విచారణ మొదలు కాగానే.. సౌరవ్‌ రాయ్ చౌదరి కూడా కోర్టులో జరిగే విచారణను సంజ్ఞలతో సారా సన్నీకి వివరించారు. అంతకముందు చూసుకున్నట్లైతే.. కేసు విచారణలో ఐఎస్‌ఎల్‌ వ్యాఖ్యాత స్క్రీన్‌లో కనిపించడంపై మోడరేటర్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల సైన్‌ లాంగ్వేజ్‌ వ్యాఖ్యాతను అనుమతించాలని సంచితా ఐన్‌.. భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు విజ్ఞప్తి చేశారు. ఫర్వాలేదు.. ఆయన (సైన్ లాంగ్వేజ్ వ్యాఖ్యాత) స్క్రీన్‌లో జాయిన్ కావచ్చు అని చెప్పి సీజేఐ అనుమతిచ్చారు. దీంతో సంచితా ఐన్‌ కేసు విచారణతో సహా మరికొన్ని ఇతర కేసుల విచారణలను కూడా సౌరవ్‌ రాయ్‌ తన సంజ్ఞలతో సారా సన్నీకి వివరించారు. అయితే ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు వచ్చిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా సైతం సౌరవ్‌ రాయ్‌ చాలా వేగంగా వాదనలను సంజ్ఞలతో వివరిస్తున్నాడని అభినలు తెలియజేశారు.

అంతేకాదు సైన్‌ లాంగ్వేజ్‌ వ్యాఖ్యాత గురించి తెలిసిన న్యాయవాదులు భారత న్యాయముర్తి జస్టస్ డీవై చంద్రచూడ్ తీసుకున్న నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే దివ్యాంగ న్యాయవాదులు కూడా ప్రత్యేక వెసులుబాటు సౌకర్యాన్ని పొందడం కోసం అనుమతించినటువంటి సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు న్యాయవాది సారా సన్నీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు భవిష్యత్తులో జరిగే కోర్టు విచారణలో వ్యాఖ్యాత సాయంతో తన వాదనలు వినిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు సారా సన్నీ. అయితే ఇలా మొదటిసారిగా ఓ న్యాయవాది కోసం సైన్ లాంగ్వేడ్ వ్యాఖ్యతను ఏర్పాటు చేయడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దీనికి అనుమతి ఇచ్చిన చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్‌పై కూడా చాలా మంది న్యాయవాదులు ప్రశంసించారు. వినికిడి లోపం ఉన్న న్యాయవదులకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని.. ఈ సమస్య ఉన్నవారు కూడా న్యాయవాది అవ్వడం కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..