AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అమ్మో హైదరాబాద్..! వద్దే వద్దు’ అంటున్న నైజీరియన్లు.. ఏకంగా బ్లాక్ లిస్ట్‌లోనే.. ఎందుకంటే..?

Hyderabad: సెలబ్రిటీలు కావచ్చు, వీఐపీలు కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు.. హైదరాబాద్ వదిలి గోవాకి వెళ్లి మరి డ్రగ్స్ సేవిస్తున్నారు తప్ప, ఇక్కడ ఉంటూ దక్షిణం తీసుకునే సహసం మాత్రం అతి కొద్ది మందే చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి. నార్కోటిక్ పోలీసులు ఏకంగా గోవాకు వెళ్లి మరి అక్కడి డ్రగ్స్ డెన్‌లపై దాడులు చేశారు. కొందరు గోవా నుండి డ్రగ్స్‌ని..

‘అమ్మో హైదరాబాద్..! వద్దే వద్దు’ అంటున్న నైజీరియన్లు.. ఏకంగా బ్లాక్ లిస్ట్‌లోనే.. ఎందుకంటే..?
Representative Image
Vijay Saatha
| Edited By: |

Updated on: Sep 25, 2023 | 6:37 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 25: స్టూడెంట్ వీసా మీద భారత్‌కు వస్తున్న నైజీరియన్లు ఇక్కడ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మెట్రో నగరాలనే టార్గెట్గా చేసుకుని వీసా ముగియగానే అక్కడికి మకాం మార్చేసి దర్జాగా గడుపుతున్నారు. మెట్రో సిటీకి వెళ్లగానే అక్కడ డ్రగ్ డీలింగ్స్ చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు పలువురు నైజీరియన్లు. అయితే ఎక్కువ శాతం నైజీరియన్లకు డ్రగ్స్ బిజినెసే ప్రధాన ఆదాయ మార్గం. డ్రగ్ సప్లై చేస్తూ కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు రాబడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ తెలంగాణలో ఇటీవల ఏర్పడిన తెలంగాణ ఆంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా చాలా వరకు డ్రగ్ డీలింగ్స్‌ని కట్ చేసేశారు. ముఖ్యంగా గోవా లాంటి ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ రాకుండా పోలీసులు అడ్డుకట్టు వేశారు. ఇంకా తమకి సమాచారం ఇస్తున్న ఇన్ఫార్మర్ల ద్వారా డ్రగ్ పెడ్ల్లర్‌పై దాడి చేసి వారి స్థావరాన్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తున్నారు.

బ్లాక్ లిస్ట్‌లో హైదరాబాద్

అయితే పోలీసులు తెలుపుతున్న సమాచారం ప్రకారం ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెలబ్రిటీలు కావచ్చు, వీఐపీలు కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు.. హైదరాబాద్ వదిలి గోవాకి వెళ్లి మరి డ్రగ్స్ సేవిస్తున్నారు తప్ప, ఇక్కడ ఉంటూ దక్షిణం తీసుకునే సహసం మాత్రం అతి కొద్ది మందే చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి. నార్కోటిక్ పోలీసులు ఏకంగా గోవాకు వెళ్లి మరి అక్కడి డ్రగ్స్ డెన్‌లపై దాడులు చేశారు. కొందరు గోవా నుండి డ్రగ్స్‌ని హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడంతో పాటు, ఇక్కడ యూత్ డ్రగ్స్ వైపు ఆకర్షతులను చేస్తున్నారు. దీంతో అలర్ట్ అయ్యిన హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్‌కు డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై గట్టిగా నిఘా పెంచారు. డ్రగ్స్ వ్యాపారం ద్వారా వీరు సంపాదించిన ఆస్తులను సైతం సీజ్ చేస్తుండడంతో నైజీరియన్లు బెంబేలెత్తి పోతున్నారు.. దీంతో హైదరాబాద్ కస్టమర్లు అంటేనే నైజీరియన్లు అవైడ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.

యాప్‌ల ద్వారా డ్రగ్స్ కట్టడి

మెటల్ డిటెక్టర్ మాదిరి డ్రగ్స్‌ను కూడా డిటెక్ట్ చేసే పరికరం ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకొని వీలైనంతగా డ్రగ్స్‌ను అరికట్టేందుకు నార్కోటిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.. డ్రగ్స్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ అండ్ మోనిటరింగ్ సిస్టం(DOPEM) యాప్ ద్వారా దేశంలో ఎక్కడ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా వారి వివరాలు తెలిసే విధంగా దీన్ని తీసుకొచ్చారు.. స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానిపులేటరీ యాక్ట్ కింద అక్రమాలు చేసి డబ్బులు కూడా బెట్టుకుంటున్న వారి ఆస్తులను సీజ్ చేస్తున్నారు.

వీటి ద్వారా హైదరాబాదులోకి డ్రగ్స్ తీసుకురావడం పెడ్లర్లకు కష్టసాధ్యమవుతుంది. దీంతో హైదరాబాద్ నుండి గోవాకు వెళ్లే టూరిస్టులను టార్గెట్ చేసి అక్కడి నైజీరియాలో వీరిని డ్రగ్స్ వైపు ఆకర్షితులను చేస్తున్నారు.. బెంగళూరు, ముంబై, గోవా నగరాల్లో షెల్టర్ పొందుతున్న నైజీరియన్లు హైదరాబాద్ అంటే మాత్రం భయపడిపోతున్నారు. హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు చేస్తున్న స్పెషల్ ఆపరేషన్‌లు కూడా వీటికి ఒక కారణం.. డార్క్ వెబ్ ద్వారా వస్తున్న ఆర్డర్లను సైతం హైదరాబాద్‌కు మినహాయింపు ఇస్తూ మిగతా నగరాలకు డ్రగ్స్‌ను సప్లై చేస్తున్నారు.

Follow Us
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..