Telangana: మరో మూడు రోజులూ వర్షాలే.. తెలంగాణ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్
వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మొదలైన వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. తెలంగాణలో రానున్న మూడు రోజులు..
మొన్నటి వరకు ఎండాకాలాన్ని తలపించే వాతావరణంతో ఇబ్బంది పడ్డ ప్రజలకు వరుణుడు ఒక్కసారిగా కూల్ న్యూస్‌ను అందించాడు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మొదలైన వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. రాష్ట్రంలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, కుమ్రంభీం ఆసీఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనాగం, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, గద్వాల, వికారాబాద్, రంగారెడ్డితో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ సోమవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
ఇక నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో మంగళ వారం ఉదయం వరకు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా జనగాం, సిద్ధిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, గద్వాల్, వనప్తి జిల్లాల్లో మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. నిజాబామాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్‌లోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో బుధవారం వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో అధికారులు సైతం ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..