AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు.. అప్లై చేసిన గంటల్లోనే అకౌంట్‌లోకి..

పాత పద్ధతులకు స్వస్తి పలికి, డిజిటల్ హంగులతో స్త్రీనిధి సరికొత్త రూపు సంతరించుకుంది. కేవలం 48 గంటల్లోనే రుణాల మంజూరు, ఏఐ ఆధారిత యాప్, పెరిగిన రుణ పరిమితి.. ఇలా ఒకటి కాదు రెండు కాదు, మహిళా సంఘాల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.

Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు.. అప్లై చేసిన గంటల్లోనే అకౌంట్‌లోకి..
Sthree Nidhi Digital Revolution In Ap
Krishna S
|

Updated on: Feb 09, 2026 | 5:35 PM

Share

గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా స్త్రీనిధి స్కీమ్‌లో ఏపీ ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అవసరానికి ఆదుకోని అప్పు వ్యర్థం అనే ఉద్దేశంతో స్త్రీనిధి రుణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. పాతకాలపు రాతలకు స్వస్తి పలికి, డిజిటల్ హంగులతో బ్యాంకింగ్ సేవలను మహిళా సంఘాల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ప్రక్షాళన మొదలైంది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే డ్వాక్రా మహిళలకు రుణం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల అత్యవసర ఆరోగ్య సమస్యలు, పెళ్లిళ్లు లేదా ఇతర అవసరాల కోసం మహిళలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లి మైక్రో ఫైనాన్స్ ఊబిలో చిక్కుకోకుండా రక్షణ లభించనుంది.

ఏఐ యాప్‌తో పారదర్శకత

స్త్రీనిధి కార్యకలాపాల కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్‌ను ప్రభుత్వం తీసుకువస్తోంది. బయోమెట్రిక్ విధానం ద్వారా కాగితం పని లేకుండానే రుణాల దరఖాస్తు, మంజూరు ప్రక్రియ జరుగుతుంది. రుణాలు తిరిగి చెల్లించడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వంటివి ఈ యాప్ ద్వారా సులభతరం కానున్నాయి.

పెరిగిన రుణ పరిమితి..

డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణాల పరిమితిని ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గతంలో రూ.5 లక్షల వరకు ఉన్న రుణ పరిమితిని ఇప్పుడు రూ.8 లక్షలకు పెంచారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.12,000 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఇది కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి

170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామకం

స్త్రీనిధి బ్యాంకింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నియామకాల్లో నిబంధనల ప్రకారం 57 మంది మహిళలు ఉండాల్సి ఉండగా, ప్రభుత్వం ఏకంగా 97 మంది మహిళలకు అవకాశం కల్పించి మహిళా పక్షపాతాన్ని చాటుకుంది. వీవోఏలు, బుక్ కీపర్లుగా అనుభవం ఉన్న వారికి ఈ పోస్టుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వీరు నియోజకవర్గ స్థాయిలో ఉండి మహిళా సంఘాలకు బ్యాంకింగ్ సేవల్లో తోడ్పాటు అందిస్తారు.

నిపుణుల సారథ్యంలో బ్యాంకింగ్

స్త్రీనిధిని పూర్తిస్థాయి బ్యాంకింగ్ సంస్థగా తీర్చిదిద్దేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ స్థాయి అధికారిని ఎండీగా నియమించారు. దీనివల్ల బ్యాంకుల కంటే వేగంగా, పారదర్శకంగా పేద మహిళలకు రుణ పరపతి లభించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్!
హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్!
పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్‌ బోర్డులు!
పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్‌ బోర్డులు!
రూ.2కే కోడిగుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే గుట్టురట్టు
రూ.2కే కోడిగుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే గుట్టురట్టు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...