కనుమరుగైన అందం మళ్ళీ కళ్ళకు కనపడింది.. కావ్య థాపర్ పిక్స్ వైరల్
29-07-2026
Pic credit - Instagram
Phani Ch
ప్రెసెంట్ యూత్ కావ్య థాపర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
కావ్య థాపర్ మహారాష్ట్రలో జన్మించింది. అయితే మొదట మోడలింగ్ అడుగు పెట్టి ఆ తరువాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
తరువాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందించింది.
ఆ తర్వాత మాస్ రాజా రవితేజ రీసెంట్ గా నటించిన ఈగల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఈగల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన కావ్యకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ బ్యూటీ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది.
ప్రస్తుతం కావ్య, హవీష్ హీరోగా, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న నేను రెడీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రం ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ విజయాన్ని అందుకుంటే కావ్యకు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.