శాకాహారులకు గుడ్ న్యూస్.. ఒమేగా-3 ఫుల్లుగా లభించే ఫుడ్ కావాలంటే..
30 July 2026
Jyothi Gadda
మానవ శరీర సాధారణ పనితీరుకు, ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు చాలా అవసరం. ఇవి శరీరంలో సహజంగా ఉత్పత్తి కావు. కాబట్టి, మనం తినే ఆహారం ద్వారానే వీటిని పొందాల్సి ఉంటుంది.
నాన్-వెజిటేరియన్లకు చేపల ద్వారా ఒమేగా-3 సులభంగా లభిస్తుంది. కానీ, శాకాహారులకు ఆప్షన్లు తక్కువ అని చాలామంది భావిస్తుంటారు. నిజానికి వృక్ష సంబంధిత నట్స్, గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
అవిసె గింజలు: కేవలం ఒక స్పూన్ అవిసె గింజల పొడి తీసుకుంటే రోజువారీ అవసరాలకు కావలసినంత ఒమేగా-3 లభిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, బీపీ అదుపులో ఉంటుంది. గుండె సమస్యలను నివారింస్తుంది.
వాల్‌నట్స్: ఇవి చూడటానికి మెదడు ఆకారంలో ఉండటమే కాక, నిజంగానే మెదడు చురుకుదనాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రోజూ గుప్పెడు వాల్‌నట్స్ తినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
గుమ్మడి గింజలు: వీటిలో ఒమేగా-3 తో పాటు జింక్, మెగ్నీషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, మంచి నిద్రకు, పురుషులలో ప్రొస్టేట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
జనపనార గింజల్లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు సరైన నిష్పత్తిలో ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచి, చర్మాన్ని తేమగా ఉంచుతాయి. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
వీటిలో ఒమేగా-3 తో పాటు ఫైబర్, ప్రొటీన్, క్యాల్షియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి బాగా సహాయపడతాయి.
మీరు పూర్తి శాకాహారులైతే, ఎలాంటి సప్లిమెంట్లు లేకుండా సహజ సిద్ధంగా ఒమేగా-3 పొందడానికి ఈ నట్స్, గింజలను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇది మీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.