AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్.. టాప్ 10లో ఒక్కరు కూడా లేరుగా..!

Top 10 Bowlers In The T20 World Cup History: టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో భారత బౌలర్ల పరిస్థితి దారుణంగా ఉంది. టాప్ 10 స్థానాలను పరిశీలిస్తే.. కచ్చితంగా మన బౌలర్లు ఆలోచించుకోవాల్సిందే. అయితే, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటే కచ్చితంగా టాప్ 5లో చేరే అవకాశం ఉంది. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్.. టాప్ 10లో ఒక్కరు కూడా లేరుగా..!
Top 10 Bowlers In The T20 World Cup History
Venkata Chari
|

Updated on: Feb 09, 2026 | 5:19 PM

Share

Top 10 Bowlers In The T20 World Cup History: టీ20 ప్రపంచకప్ 2026 సందడి మొదలైంది. దాదాపుగా అన్ని జట్లు తమ తొలి మ్యాచ్ లను పూర్తిచేశాయి. అయితే, అసలు ఐసీసీ టీ20 ప్రపంచకప్ హిస్టరీలో టాప్ 10 బౌలర్ల గురించి మాట్లాడితే.. ఈ విషయంలో భారత జట్టుకు భారీ షాక్ తగలింది. ఎందుకంటే, ఈ లిస్ట్ లో ఒకే ఒక్క ప్లేయర్ చోటు దక్కించుకున్నాడు. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్ 2007లో జరిగింది. ఈ ఏడాది భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్ లలో భారత ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బ్యాటర్ల విషయానికి వస్తే భారత జట్టుకు తిరుగులేదు. కానీ, బౌలర్ల విషయానికి వస్తే మాత్రం కచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిందే. ఎందుకంటే, టాప్ 10లో ఒక్క ప్లేయర్ కూడా లేకపోవడం గమనార్హం. టీ20 ప్రపంచకప్ హిస్టరీని ఓసారి పరిశీలిస్తే.. అత్యంత విజయవంతమైన బౌలర్లలో టాప్ 5 లిస్ట్ లో ఆసియా నుంచే ఉన్నారు. కానీ, వీరిలో ఒక్కరు కూడా భారత జట్టు నుంచి లేకపోవడం గమనార్హం. ఇక ఈ ఏడాది టోర్నమెంట్ లో మెరుగైన ప్రదర్శన చేస్తే ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపాతోపాటు సౌతాఫ్రికా బౌలర్ అన్రిక్ నార్ట్జే టాప్ 5లో చోటు దక్కించుకోవచ్చు.

అర్షదీప్ సింగ్ టాప్ 5లో చేరే ఛాన్స్..

టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ టాప్ 10లో చేరే ఛాన్స్ ఉంది. మెరుగైన ప్రదర్శన చేస్తే కచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. ప్రస్తుతం ఈ టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ 19వ స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 15 మ్యాచ్ లు ఆడిన అర్షదీప్ 29 వికెట్లతో 19వ స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఇక టీమిండియా తరపున అత్యంత విజయవంతమైన బౌలర్ గురించి మాట్లాడితే రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే ఉన్నాడు. అశ్విన్ 24 మ్యాచ్ ల్లో 32 వికెట్లు పడగొట్టి 13వ స్థానంలో నిలిచాడు.

బంగ్లాదేశ్ బౌలర్ షకీబ్ అల్ హాసన్ 43 మ్యాచ్‌ల్లో 50 వికెట్లతో తొలి స్థానంలో నిలిచాడు. అలాగే శ్రీలంకకు చెందిన వానిందు హసరంగా 40 వికెట్లతో (20 మ్యాచ్‌ల్లో) రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది 34 మ్యాచ్‌ల్లో 39 వికెట్లతో 3వ స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఇక ఆప్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ 38 వికెట్ల(24 మ్యాచ్‌ల్లో)తో నాల్గవ స్థానంలో నిలిచాడు. ఇక ఐదవ స్థానంలో శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ 38 వికెట్ల(31 మ్యాచ్‌ల్లో)తో నిలిచాడు.

టీ20 ప్రపంచకప్ 2026లో పోటీ తీవ్రం..

కంగారు బౌలర్ ఆడమ్ జంపా 36 వికెట్లతో 6వ స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది టోర్నమెంట్ లో అద్బుత ప్రదర్శన చేస్తే కచ్చితంగా టాప్ 5లో నిలిచే ఛాన్స్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో పాకిస్తాన్ మాజీ బౌలర్ సయీద్ అజ్మల్ (23 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు) నిలిచాడు. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ (25 మ్యాచ్‌ల్లో సౌథీ 36 వికెట్లు) ఎనిమిదో స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికాకు చెందిన అన్రిచ్ నార్ట్జే (19 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు) తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పదో స్థానంలో శ్రీలంకకు చెందిన అజంతా మెండిస్ (21 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు) నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..