World Record: పాకిస్తాన్‌కు దేవుడిచ్చిన తమ్ముడు.! 12 వైడ్‌లు, ఒక నో బాల్.. టీ20ల్లోనే పరమ చెత్త రికార్డు
టీ20 ఫార్మాటు అంటేనే బ్యాటర్ల ఫార్మాట్ అని పేరు ఉంది. అయితే ఈ బౌలర్ టీ20లలోనే అత్యంత లాంగ్ ఓవర్ ఒకటి వేశాడు.. ఆరు కాదు పది కాదు.. ఏకంగా 18 బంతుల ఓవర్ వేశాడు. పైగా ప్రత్యర్ధి ఎవరో కాదు పాకిస్తాన్ జట్టు. మరి ఆ బౌలర్ ఎవరంటే.?

2023 వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ జాన్ హేస్టింగ్స్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త ఓవర్‌ను వేశాడు. పాకిస్థాన్ గెలవడానికి 20 పరుగులు అవసరమైన తరుణంలో, హేస్టింగ్స్ ఒకే ఓవర్‌లో 12 వైడ్‌లు, ఒక నో బాల్‌తో కలిపి మొత్తం 18 బంతులు వేసి షాక్‌కు గురి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ చరిత్రలో ఇంత చెత్త బౌలింగ్ దాదాపు ఎవరూ వేయలేదనే చెప్పాలి. 2023లో జరిగిన ఒక ముఖ్యమైన వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆసిస్ పేసర్ జాన్ హేస్టింగ్స్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఆ సమయంలో పాకిస్థాన్ విజయం సాధించడానికి కేవలం 20 పరుగులు మాత్రమే అవసరం.
హేస్టింగ్స్ తన ఓవర్‌ను ప్రారంభించిన వెంటనే వరుసగా ఐదు వైడ్ బంతులు వేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఎలాగోలా రెండు లీగల్ బంతులు వేసిన తర్వాత, మళ్ళీ ఒక నో బాల్ వేసి ఒత్తిడిని మరింత పెంచాడు. ఆ వెంటనే మరికొన్ని వైడ్‌లు బౌలింగ్ చేశాడు. హేస్టింగ్స్ పూర్తిగా తన లైన్ అండ్ లెంగ్త్‌ను కోల్పోయి, ఓవర్ చివర్లో మళ్ళీ వరుసగా ఐదు వైడ్‌లు వేశాడు. మొత్తంగా ఆ ఒకే ఓవర్‌లో 12 వైడ్‌లు, ఒక నో బాల్‌తో కలిపి మొత్తంగా 18 బంతులు వేశాడు. అప్పట్లో ఆ బౌలర్ వేసిన ఓవర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
