AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: టీమిండియాకు మరో బిగ్‌షాక్.. నమీబియాతో మ్యాచ్ నుంచి అభిషేక్ ఔట్.. కారణం ఏంటంటే?

India vs Namibia: టీమిండియా తన నెక్ట్స్ మ్యాచ్‌ను నమీబియాతో ఆడనుంది. ఇప్పటికే అమెరికాపై విజయం సాధించిన భారత జట్టు.. మరో విజయంపై కన్నేసింది. అయితే, భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ రెండో మ్యాచ్ ఆడడంపై అనుమానాలు వస్తున్నాయి. అందుకు గల కారణం ఓసారి చూద్దాం..

Video: టీమిండియాకు మరో బిగ్‌షాక్.. నమీబియాతో మ్యాచ్ నుంచి అభిషేక్ ఔట్.. కారణం ఏంటంటే?
Abhishek Sharma
Venkata Chari
|

Updated on: Feb 09, 2026 | 6:56 PM

Share

Abhishek Sharma: టీ20 ప్రపంచకప్ 2026 సందడి గ్రాండ్ గా మొదలైంది. అయితే, గాయాలతో చాలా జట్లు ఇబ్బంది పడుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా ఇబ్బంది పడింది. మరోవైపు టీమిండియా కూడా ఈ గాయాలా ఎఫెక్ట్ ను ఎదుర్కొంటుంది. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, తిలక వర్మ ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. బుమ్రా కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడు. తాజాగా ఈ లిస్ట్ లో టీమిండియా డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా చేరినట్లు తెలుస్తోంది. అందుకు గల కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే, అభిషేక్ శర్మ అనారోగ్యం టీమిండియాకు ఇబ్బందిగానే ఉండొచ్చు. అమెరికా జట్టు బ్యాటింగ్ చేసే సమయంలో ఈ యంగ్ డైనమేట్ మైదానంలోకి దిగలేదు. అభిషేక్ స్థానంలో శాంసన్ ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. అంతకుముందు అభిషేక్ తొలి బంతికే డకౌట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే, టీమిండియా తదుపరి మ్యాచ్ గురువారం ఢిల్లీలో నమీబియాతో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆదివారం సాయంత్రం తన నివాసంలో జట్టుకు విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విందు కోసం ఆటగాళ్లు అంతా వచ్చారు. కానీ, అభిషేక్ శర్మ మాత్రం అందరికంటే ముందుగానే తిరుగుప్రయాణం అయ్యాడు. చాలా మంది సిబ్బంది ఈ యంగ్ గన్ కు వీడ్కోలు పలికేందుకు వచ్చినట్లు వీడియోలో చూడొచ్చు. ఈ క్రమంలో నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్‌కు అభిషేక్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: IND vs NED: నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్.. ఎవరంటే..?

అస్వస్థతకు గురైన అభిషేక్..

టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో అమెరికాను ఓడించే ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగింది. కానీ, అమెరికా జట్టు గట్టి పోటీ ఇవ్వడంతో టీమిండియా కష్టపడి గెలవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ తర్వాత, మహమ్మద్ సిరాజ్ విలేకరుల సమావేశంలో పాల్గొని అభిషేక్ తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పితో ఆట ఆడాడని వెల్లడించాడు. “అభిషేక్ శర్మకు కడుపు నొప్పిగా ఉంది. అందుకే అతను ఫీల్డింగ్ చేయలేదు” అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా కూడా జ్వరం కారణంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. గురువారం నమీబియాతో జరిగే మ్యాచ్‌కు ఆయన దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్.. టాప్ 10లో ఒక్కరు కూడా లేరుగా..!

అభిషేక్‌కు విశ్రాంతి ఇస్తే..?

భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచింది. రెండో మ్యాచ్ లో నమీబియాను ఢీ కొట్టనుంది. అభిషేక్ తిరిగి మైదానంలోకి వస్తాడని సిరాజ్ నమ్మకంగా ఉన్నాడు. కానీ టీమిండియా కోచ్చ గంభీర్ మరో ప్లాన్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్ ఆరోగ్యం మెరుగుపడకపోతే సంజూ శాంసన్ ఓపెనర్ గా బరిలోకి దిగవచ్చు. ఫిబ్రవరి 15న భారత్ పాకిస్తాన్‌తో టీ20 ప్రపంచకప్ 2026లో బిగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ ఘర్షణకు అభిషేక్ వంద శాతం ఫిట్‌గా ఉంటాడని మెన్ ఇన్ బ్లూ టీం భావిస్తోంది. అంటే, నమీబియా మ్యాచ్‌కు అతనికి విశ్రాంతి ఇస్తే, సంజూ శాంసన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సంజూ శాంసన్ ఈ మ్యాచ్ ఆడితే.. తదుపరి రౌండర్ కు వెళ్లే క్రమంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది. అంటే, నమీబియా మ్యాచ్ తో అతను బాగా రాణించాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..