AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?

కలెక్టర్లు, మంత్రుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కలెక్టర్లు, మంత్రులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. మంత్రులంటే కేవలం పాలసీలు తయారుచేసే వాళ్లు మాత్రమే కాదని.. సేవలంటే పాలసీలు మాత్రమే కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రులు, కలెక్టర్లు నెలలవారీగా సమీక్షించుకోవాలని.. అప్పుడే అభివృద్ధిలో పురోగతి తెలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
Ap Cm Chandrababu
Anand T
|

Updated on: Feb 09, 2026 | 5:23 PM

Share

జనాభా నిర్వహణ, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారం తదితర అంశాలపై కార్యదర్శులు, మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. వేసవిలో నీటి ఎద్దడి ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజనంలో పోషకాహారం ఉండాలని,విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.

అలాగే పోలవరం ప్రాజెక్టు పనులపై కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయిందని.. 2027 పుష్కరాల కన్నా ముందే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. అలాగే రాబోయే మూడేళ్లలో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కూడా పూర్తవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అమరావతి మోస్ట్‌ లివబుల్‌ సిటీగా మారుతుందని చెప్పుకొచ్చారు. అలాగే కేంద్రం ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కూడా లాభాల్లోకి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!